హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే కారులో హెల్మెట్ పెట్టుకోలేదని అందులోని వ్యక్తి పోలీసులు జరిమానా విధించారు. కారులో హెల్మెట్ పెట్టుకోకుండే జరిమానా ఏంటని.. కారు డ్రైవర్ షాక్ కి గురయ్యాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్ పుర్ జిల్లాలోని ముస్కరా పట్టణంలోని ఓ ప్రాంతంలో చెందిన పవన్ కుమార్ అనే నివాసం ఉంటున్నాడు. అతడు న్యూస్ పేపర్ సప్లయ్ చేస్తూ, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ 18న తన కారులో వార్తపత్రికలను సరఫరా చేసి.. తిరిగి ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు పవన్ కారును ఆపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నందకిశోర్ యాదవ్ కారు ఫోటో తీసి రూ. 1000 జరిమానా విధించారు. అయితే తనకు ఎందుకు జరిమానా విధించారని పవన్ కుమార్ పోలీసులను ప్రశ్నించాడు.
ఆ సమయంలో వారు చెప్పిన సమాధానం విని పవన్ కుమార్ ఖంగుతిన్నాడు. వారు చెప్పిన సమాధానం ఏంటంటే.. హెల్మెట్ పెట్టుకోనందుకు చలాన్ విధించారంట. పవన్ మొబైల్ కు చలాన్ విధించిన మెసేజ్ కూడా వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఏమిటని పవన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు చలాన్ రద్దు చేస్తామని హామి ఇచ్చి అతడి పంపిచేశారు. అయినా బిల్లు ఇన్ వాయిస్ రద్దు కాకపోవడంతో తప్పని పరిస్థితులలో పవన్ రూ.1000 జరిమాన విధించాల్సి వచ్చింది. మరి.. కారులో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.