దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇటీవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండు కోకా కోలా బాటిల్స్‌ను చూపిస్తూ వాటిని తాగవద్దని, ఆరోగ్యానికి హానికరం అన్నాడు. దీంతో కోకా కోలా షేర్ల ధరలు పడిపోయాయి. 56.10 డాలర్లు ఉన్న షేర్ ధర 55.22 డాలర్లకు పడిపోయింది. కోకా కోలాకు బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించింది. దీనిని తన క్రియేటివ్ టీం తో క్యాష్ చేసుకుంటోంది ఫెవికాల్. ప్రకటనలలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఫెవికాల్, తాజాగా ఒక పోస్ట్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. క్రిస్టియానో రొనాల్డో ఘటనను గుర్తుకు తెచ్చేలా ఫెవికాల్ ఓ యాడ్‌ను రూపొందించింది. కోకా కోలాకు వ్యంగ్యంగా ఫెవికాల్ ఆ యాడ్‌ను ప్రసారం చేస్తుండడం నెటిజన్లకు వినోదాన్ని పంచుతోంది.
రెండు ఫెవికాల్ డబ్బాలు టేబుల్ మీద ఉంటాయి. వాటిని చూపిస్తూ ఫెవికాల్ ఓ కాప్షన్‌ను కూడా పెట్టింది. రోనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించే విషయంపై ఫెవికోల్ కంపెనీ ఇన్‌డైరక్ట్‌గా కోకాకోలాకు అదిరిపోయే సూచన చేసింది. ఫెవికాల్ తన ట్విటర్ పోస్ట్‌లో రొనాల్డో హజరైన ప్రెస్‌మీట్‌ను పోలి ఉన్న ఫోటోలో, కోకాకోలా బాటిళ్లకు బదులు ఫెవికోల్ డబ్బాలను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు. అంతేకాకుండా కంపెనీ షేర్ విలువ కూడా పడిపోయేది (‘న బాటిల్ హేటేగీ, న వాల్యుయేషన్ ఘటేగి’) కాదని సూచిస్తూ వ్యంగ్యంగా కోకాకోలాకు సూచించింది.
దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. కోకా కోలా ఉదంతానికి ప్యారడీగా ఫెవికాల్ ప్రసారం చేస్తున్న ఆ యాడ్ ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నెటిజన్లు చాలా మంది ఫెవికాల్ క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు. కాగా కోకా కోలా ప్రస్తుతం దిద్దుబాటు చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Haye ni mera Coka Coka Coka Coka Coka#Euro2020 #Ronaldo #MazbootJod #FevicolKaJod pic.twitter.com/lv6YWrgfxB
— Fevicol (@StuckByFevicol) June 17, 2021