అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు సంబంధించారు. ఇటీవలే డోనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రతినిధుల సభకు స్పీకర్ పదవికి పోటీపడ్డారు. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు కాబట్టి బాగానే ఓట్లు పడి ఉంటాయని అందరు భావించి ఉంటారు. అయితే అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ స్పీకర్ పదవికి పోటీ చేసి ట్రంప్ కు వచ్చింది కేవలం ఒక్కే ఒక్క ఓటు. అది కూడా ఆయనను స్పీకర్ పోటీకి నామినేట్ చేసిన నేత వేసిన ఓటు మాత్రమే. ఆ ప్రతినిధుల సభలో మొత్తం 430 ఓట్లు ఉండగా.. ట్రంప్ కు ఒక్కటే ఓటు రావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాని ప్రతినిధుల సభలో ప్రకటించగానే మిగిలిన సభ్యులందరూ ఘల్లుమని నవ్వారు. అమెరికా జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్ అభ్యర్థి కెవిన్ మెక్ కార్తీని మూడో రోజు సైతం విజయం పలకరించలేదు. స్పీకర్ ను ఎన్నుకుని విషయంలో ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా నానా తంటాలు పడుతున్నారు. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది వందేళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్ నేత ఫెడెరిక్ గిల్లెట్ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత నుంచి మొదటి రౌండ్లోనే స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే దాదాపు 100 ఏళ్ల తరువాత మళ్లీ పునరావృతం జరిగింది.ప్రతినిధుల సభలో స్పీకర్ గా ఎన్నిక కావాలంటే 218 ఓట్లు రావాలి. వాస్తవానికి ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజార్టీ ఉండటంతో కెవిన్ మెక్ కార్తీ సులభంగా గెలవాల్సింది.
అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు రిపబ్లికన్ సభ్యులు సమర్ధించడం లేదు. దీంతో రోజులుగా ఓటింగ్ మీద ఓటింగ్ కొనసాగుతునే ఉంది. ఇప్పటికే వరకు 12 సార్లు ఓటింగ్ జరిగిన మెకార్తీ విజయం సాధించలేకపోయారు. ఈ క్రమంలోనే 11వ రౌండ్ ఎన్నిక ఫలితాన్ని హౌస్ క్లర్క్ వెల్లడిస్తూ.. ట్రంప్‌కు ఒకే ఒక్క ఓటు పోలైందని తెలిపారు. దీంతో సభలోని సభ్యులందరూ పగలబడి నవ్వారు. ఆ ఒక్క ఓటు కూడా ట్రంప్ అభ్యర్థిత్వాని సమర్థించిన మాట్ గేట్జ్ వేసిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి ఒక్కే ఓటు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.