సాధారణంగా జంతువులకు మనుషుల కంటే తెలివి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి ప్రమాదాల్లో ఈజీగా పడిపోతుంటాయి. ఒక వేళ జంతువులకు అమాయకత్వం కూడా తోడైతే.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. తాజాగా, ఓ ఆవు తన అమాయకత్వం కారణంగా రెండు సార్లు ఇబ్బందికి గురైంది. ఆ రెండు సార్లు రెస్క్యూ సిబ్బంది దాన్ని రక్షించారు. ఈ రెండు ఘటనలు కేవలం 24 గంటల వ్యవధిలోనే జరగటం గమనార్హం. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా, సిడ్నీలోని క్యాడెన్స్ ప్రాంతానికి చెందిన ఓ ఆవు కొద్దిరోజుల క్రితం రోడ్లు పట్టుకుని తిరగసాగింది.
కొద్ది సేపటి తర్వాత జనంతో బిజీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోకి దూరింది. లోపల అటు, ఇటు తిరగసాగింది. మాల్‌లోకి ఆవు రావటంతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. మాల్ సిబ్బంది రెస్క్యూ టీంకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వారు మాల్‌కు వచ్చారు. అతి కష్టం మీద అక్కడినుంచి దాన్ని బయటకు తీసుకెళ్లారు. వెర్రింగ్టన్లోని ఓ యూనివర్శిటీలో దాన్ని ఉంచారు. ఉదయం దాన్ని వదిలేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో రెస్క్యూ సిబ్బందికి ఓ ఫోన్ వచ్చింది. డ్యాం దగ్గర బురదలో ఓ ఆవు ఇరుక్కుపోయిందని చెప్పారు.
రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడి వెళ్లారు. బురదలో ఇరుక్కున్న ఆవును చూసి ఆశ్చర్యపోయారు. అది తాము మాల్నుంచి బయటకు తెచ్చిన ఆవేనని గుర్తించారు. అతి కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇక, ఆ ఆవు ఎవరిది? ఎక్కడినుంచి వచ్చిందన్న వివరాలు అయితే తెలియరాలేదు. ఈ ఘటనపై స్పందిస్తున్న జనం ఆవు అమాయకత్వానికి చింతిస్తున్నారు. దాన్ని ఓ చోట ఉంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరి, తన అమాయకత్వం కారణంగా రెండు సార్లు ఇబ్బందికి గురైన ఆ ఆవుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.