బర్గర్ బేకరీ స్థాయిని బిల్లు అయితే రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ మనం చెప్పుకోబోయే క్రెడిటి కార్డ్ కావాల్సిందే. డెబిట్ కార్డ్ అమౌంట్ కూడా చాలదు. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్‌గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు. ఈ బర్గర్‌ను నెదర్లాండ్స్‌లోని డే డాల్టన్ రెస్టారెంట్‌లో పని చేస్తున్నరాబర్ట్ జాన్ డీ వీన్ అనే చెఫ్ తయారు చేశారు. దీనికి ‘గోల్డెన్ బాయ్’గా నామకరణం చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఆహార ప్రియులంతా దీనివైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ బర్గర్ తయారీలో ఖరీదైన బెలూగా కేవియర్, పెద్ద సముద్రపు పీత, కుంకుమ పువ్వు, వాగ్యు బీఫ్, పంది మాంసం, అరుదైన రకం తెల్లటి పుట్టగొడుగులు, చీజ్ వినియోగించినట్టు తయారీదారులు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ప్రపంచంలో ఖరీదైన సివెట్ కాఫీ గింజలతో తయారు చేసిన బార్బెక్యూ సాస్‌ను ఇందులో ఉపయోగించారు.
ఈ బర్గర్‌లో ఖరీదైన డామ్ పెరిగ్నాన్ షాంపేన్‌తో తయారు చేసిన బన్‌ను వాడారు. ఆ బన్లపై బంగారు ఆకులతో అలంకరించారు. ఇన్ని ఖరీదైన పదార్థాలు వాడినందుకే ఈ బర్గర్ ధర రూ.లక్షల్లో ఉంది. విక్రయించగా వచ్చిన సొమ్మును ఏదైనా ఎన్జీవోకు దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వీన్ తెలిపారు.