వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా నెదర్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మన తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు. 76 బంతుల్లోనే 111 పరుగులు చేసి నెదర్లాండ్ సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో అనుభవమున్న ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. తేజ నిడమానూరు విజయవాడకి చెందిన కుర్రాడు. అసలు అతని ప్రయాణం.. ‘విజయవాడ టూ నెదర్లాండ్స్ నేషనల్ క్రికెట్ టీమ్’ వరకు ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా నిన్న సంచలనం నమోదయింది. పటిష్టమైన వెస్టిండీస్ జట్టుకి మరో పరాభవం ఎదురైంది. ఇప్పటికే జింబాబ్వే చేతిలో పరాజయం విండీస్ జట్టుని కుదిపేస్తే ఇప్పుడు మరో పసికూన నెదర్లాండ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో విండీస్ సూపర్ సిక్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ మ్యాచులో ఆంధ్ర కుర్రాడు తేజ నిడమానూరు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ మ్యాచులో ఒంటి చేత్తో నెదర్లాండ్స్ కి విజయాన్ని అందించాడు. తమ జట్టు సూపర్ సిక్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో విండీస్ కథ ముగిసినట్లుగానే కనబడుతుంది. నెదర్లాండ్స్ జరిగిన ఈ మ్యాచులో ఊహించని పరాభవాన్ని చవి చూసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ జట్టులో నికోలస్ పూరన్ మెరుపు సెంచరీతో చెలరేగి ఆడగా.. కెప్టెన్ హోప్, చార్లెస్ అర్ధ సెంచరీతో రాణించారు. ఇక చివర్లో కీమో పాల్ చెలరేగడంతో 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందు ఉంచింది. పసికూన అయినా డచ్ టీం ఈ టార్గెట్ ఛేజ్ చేయడం దాదాపు అసాద్యమే అనుకున్నారు. కానీ కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ మ్యాచ్ ఆసాంతం పోరాడుతూనే ఉంది. మ్యాచ్ గెలవకపోయినా టై చేసుకోగలిగింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఇక ఈ మ్యాచులో నెదర్లాండ్ సూపర్ ఓవర్ లో గెలిచినా.. అసలు కారణం మన తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు. 76 బంతుల్లోనే 111 పరుగులు చేసి నెదర్లాండ్ సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో అనుభవమున్న ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. తేజ సెంచరీలో 11 ఫోర్లతో పటు 3 సిక్సులు కూడా ఉన్నాయి. తేజకి కెప్టెన్ ఎడ్వార్డ్స్, కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం తేజ ఆడిన ఈ ఇన్నింగ్స్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. ఛేజింగ్ లో ఇతడు నెదర్లాండ్స్ కి కోహ్లీ లా మారాడు. ఒక వైపు వికెట్లు పడుతున్న జట్టుని గెలిపించాలని అతని పోరాట స్ఫూర్తికి అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తేజకి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఛేజింగ్ చేస్తున్న సమయంలో కొన్ని మ్యాచులు గెలిపించాడు. కానీ అవి మాములు మ్యాచులు కావడంతో ఈ కుర్రాడికి రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే విండీస్ మీద ఇలాంటి ఇన్నింగ్స్ ఆడిన తేజ ఇప్పుడు ఓవర్ నైట్ హీరో అయిపోయాడు.
తేజ పేరు నెదర్లాండ్స్‌లోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. ఎందుకంటే అతను పక్కా తెలుగు.. విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో చదివిన 24 క్యారెట్ల తెలుగు కుర్రాడు. మరి విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఈ కుర్రాడు నెదర్లాండ్స్ టీమ్‌కు ఎందుకు ఆడుతున్నాడు? ఇండియాలో అవకాశాలు రాలేదా? అసలు అతని ప్రయాణం.. ‘విజయవాడ టూ నెదర్లాండ్స్ నేషనల్ క్రికెట్ టీమ్’ వరకు ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
1994 ఆగస్ట్ 22న విజయవాడలో పుట్టిన తేజ.. చదువులకు కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే ఉన్నత చదువులు అభ్యసించి, విదేశాల్లో భారీ జీతం వచ్చే ఉన్నత ఉద్యోగం సైతం సంపాదించాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఇష్టమున్నా.. చదువులోనూ మెరుగ్గా ఉండటం, విదేశీ ఉద్యోగం వెతుక్కుంటూ రావడంతో, తేజ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా స్థిరపడ్డాడు. కానీ, మనసులో ఎక్కడో క్రికెటర్ అవ్వాలనే తపన అతన్ని అనునిత్యం వెంటాడుతూనే ఉంది. మంచి ఉద్యోగం ఉన్నా, లక్షల్లో జీతం వస్తున్నా.. ఆత్మ సంతృప్తిని ఇవ్వడం లేదు. తనని తాను ఓ గొప్ప క్రికెటర్‌గా చూసుకోవాలనే కల అతన్ని వెంటాడింది. ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ పోతే.. జీవితంలో ఇంకేం సాధించలేమని అనుకున్న తేజ.. 2017-18 మధ్య ఆక్లాండ్ తరఫున క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆక్లాండ్ సూపర్ స్మాష్ లీగ్‌లోనూ అరంగేట్రం చేశాడు. 2019లో నెదర్లాండ్స్‌కు షిఫ్ట్ అయిన తేజ.. ప్లేయర్ కమ్ క్రికెట్ కోచ్‌గా మారిపోయాడు. మరి ఒక తెలుగు ప్లేయర్ ఇలాంటి సంచలన ఇన్నింగ్స్ ఆడి నెదర్లాండ్స్ కి విజయాన్ని అందించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.