ఒక మనిషికి ఎక్కువ మంది భార్యల ఉండటం.. పిల్లలు ఉండటం సర్వసాధారణం. అయితే.. ఒక భార్యతో చాలా మంది పిల్లలను కలిగి ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, పెళ్లి కాకుండా ఓ వ్యక్తి 60 మంది పిల్లలకు తండ్రి కావటం అనేది.. వింత, విచిత్రమైన ఘటన ఇదెలా సాధ్యం అయింది.
ప్రస్తుత కాలంలో సంతానలేమి దంపతులను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. ఆడలోనో.. మగలోనో సమస్య ఉండి సంతానం లేక అల్లాడిపోతున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్, స్పీడు తక్కువగా ఉండటం లేదా వ్యంధత్వం ఉంటే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అందుకే ఐవీఎఫ్ క్లినిక్‌లు స్పెర్మ్ డోనర్ల ద్వారా స్పెర్మ్‌ను సేకరించి.. దాని ద్వారా అవసరమైన వారికి పిల్లల్ని కనే భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే, కొంతమంది స్పెర్మ్ డోనర్లు తమ స్వార్థం కోసం పిల్లలు లేని వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. తాజాగా, ఓ స్పెర్మ్ డోనర్‌కు సంబంధించిన పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వివిధ పేర్లు మార్చుకుని దాదాపు 60 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఎల్‌జీబీటీక్యూ దంపతులు స్పెర్మ్ డోనర్స్ ద్వారా పిల్లలను కన్నారు. ఓ రోజు వీరంతా గెట్‌టూగెదర్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వీరి పిల్లలు కూడా వచ్చారు. వచ్చిన పిల్లల్లో దాదాపు 60 మంది ఒకే పోలికలతో ఉండటంతో వారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన అన్నె క్లర్క్ అనే వ్యక్తి స్పెర్మ్ డోనింగ్ సేవలు అందిస్తునట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. వందల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు, పేర్లతో అవసరమైన వారికి స్పెర్మ్ డొనేట్ చేశాడు. ఇలా దాదాపు 60 మంది ఎల్‌జీబీటీక్యూ దంపతులకు స్పెర్మ్ ఇచ్చాడు.
వీరంతా పిల్లలను కన్న తర్వాత ఒక చోటుకు చేరటంతో అసలు విషయం బయటపడింది. ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం ఇలా చేయటం నేరం. ఇందుకు 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియరాలేదు. కాగా, స్పెర్మ్ డోనింగ్ థీమ్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. డబ్బు అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా స్పెర్మ్ డొనెట్ చేస్తూ ఉంటారు. కానీ, దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి, మోస పూరితంగా స్పెర్మ్ డొనేట్ చేసి 60 మంది పిల్లలకు తండ్రి అయిన అన్నె క్లర్క్ అనే వ్యక్తి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.