ఉన్నఫళంగా కోటీశ్వరులు అవ్వలనే ఆత్యాశ, ఎలాగైనా డబ్బు సంపాందించాలనే కాంక్షతో కొందరు తప్పుడు దారుల్లో నడుస్తూ మోసం చేయడం అలవాటుగా చేసుకుంటారు. చదువు లేక దోంగతానాలు దోపిడీలు చేసే వారితో కంటే చదువు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు చేసే మోసానికి చాలా మంది బలవుతారు. అలాంటి మోసమే అమెరికాలో వెలుగుచూసింది. చదువుకుంటున్న సమయంలో అడ్డగోలు ఖర్చులకు డబ్బు సరిపడగా ఒక యువకుడు మోసాన్నే మనీ ట్రీగా మార్చుకున్నాడు. చదువును ఆపేసి దేశం కానీ దేశం వెళ్లి వందమందిని దారుణంగా మోసం చేసి దాదాపు రూ.660 కోట్లను దోచుకున్నాడు. ఆ భారీ మోసం ఎలా జరిగిందో మీరూ తెలుసుకోండి..
ఆస్ట్రేలియాకు చెందిన 24 ఏళ్ల స్టెఫెన్ క్విన్ డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కాడు. మధ్యలో చదువు మానేసి 2017లో ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చాడు. న్యూయార్క్ సిటీలో ‘వర్జిల్ సిగ్మా ఫండ్ ఎల్పీ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ ధరకే క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయోచ్చని నమ్మించాడు. క్రిప్టోకరెన్సీపై ట్రేడింగ్ నిర్వహించేందుకు ‘టెంజిన్’ అనే స్పెషల్ ట్రేడింగ్ అల్గారిథంను డెవలప్ చేసి, క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో బిట్ కాయిన్ కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించాడు.
2017లో వర్జిల్ సంస్థ 500 శాతం వార్షిక రాబడిని పొందిందని ప్రచారం చేసుకున్నాడు. 2018లో క్విన్ గురించి ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం కథనాల్ని ప్రచురించింది. ఆ పబ్లిసిటీని క్యాష్ చేసుకోవాలని ఇన్వస్టర్లకు లాభాల్ని అందించే సంస్థ తన దేనంటూ సుమారు 100 మంది నుంచి సుమారు (90మిలియన్లు) రూ. 660 కోట్లు పెట్టుబడులు పెట్టించాడు. ఆ డబ్బును తన వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నాడు. పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నాయని నమ్మించేందుకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి క్రిప్టోకరెన్సీలతో సంబంధం లేని రియల్ ఎస్టేట్, బ్యాంకులు ఇచ్చిన రుణాల్ని చెల్లించలేక మూలన పడిన సంస్థల్ని కొనుగోలు చేశాడు.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం..”ఇన్వెస్టర్లు పెట్టుబడుల గురించి అడిగినప్పుడు..తమ సంస్థ పెట్టుబడులు పెట్టిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయని ఫేక్ డాక్యుమెంట్లు చూపించి తప్పించుకునేవాడు. చివరికి ఇన్వెస్టర్లు నిందితుడు క్విన్‌పై అనుమానం రావడంతో కోర్ట్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యూయార్క్ సౌత్రన్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జ్ వాలెరీ కాప్రోనీ నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు.