ఇంటర్నేషనల్ డెస్క్- అంతర్జాతీయ ఉగ్రవాది నేత ఒసామా బిన్ లాడెన్ గుర్తున్నాడు కదా. అదేనండీ అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను విమానంతో ఢీకొట్టి కూల్చేశాడు కదా. అంటే ఆ తరువాత అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టాయనుకొండి. ఇన్నాళ్లకు ఆయన గురించి ఎదుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. ఒసామా బిన్ లాడెన్ కు చెందిన ఓ ఖరీదైన భవంతి ఇప్పుడు అమ్మకానికి వచ్చింది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండెకరాల విస్తీర్ణంలో ఉందీ భవంతి. ఈ విలాసవంతమైన భవనం ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహిమ్ లాడెన్ కు చెందింది. లాస్ ఏంజెలెస్ లో ధనవంతులు ఉండే ప్రాంతం, హోటల్ బెల్ఎ యిర్‌కు సమీపంలో ఉంది. రెండెకరాల విస్తీర్ణంలో ఏడు బెడ్రూమ్‌లు, ఐదు బాత్రూమ్‌లతో ఉన్న ఆ బంగళాను 28 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలుకు బేరం పెట్టారు.
1931లో నిర్మించిన ఆ బంగళాలను ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహిమ్ 1983లో రెండు మిలియన్ డాలర్లకు కొన్నాడు. మాజీ భార్య క్రిస్టిన్ సినేతో కలిసి ఇబ్రహిమ్ అక్కడే ఉండేవాడు. ఆ సమయంలో ఒసామా బిన్ లాడెన్, అతని భార్య కూడా అక్కడే వారికి సహాయకులుగా నివసించేవారు.
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఒసామా బిన్ లాడెన్ దాడి తర్వాత ఈ విల్లా ఖాళీ అయిపోయింది. అప్పట్నుంచి లాడెన్ వంశీయులెవరూ అక్కడ అడుగుపెట్టలేదు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ఖరీదైన విల్లా ఖాళీగానే ఉంది. ఇదిగో ఇన్నేళ్ల తరువాత ఇబ్రహీం ఈ విల్లాను అమ్మెస్తున్నాడు.