ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ సీయినర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారంటూ మద్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. చంద్రమోహన్ గుండెపొటుతో చనిపోయారనే న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఐతే నిజానికి చంద్రమోహన్ చనిపోలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. తాను చనిపోయానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన చంద్రమోహన్, ఎవరో తాను చనిపోయానని ప్రచారం చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. మొన్న ఆదివారంతో 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగుపెట్టారట చంద్రమోహన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
అభిమానుల ఆశీస్సులే శ్రీరామ రక్ష అని చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఇక చంద్రమోహన్ చనిపోయారంటూ ప్రచారం జరగడం ఇదేం మొదటి సారి కాదు. గతంలోను ఆయన ఆనారోగ్యంతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అప్పుడు కూడా చంద్రమోహన్ ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు కూడా చంద్రమోహన్ చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో చంద్రమోహన్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నిక్షేపంగా ఉన్న మనిషిని పట్టుకుని చనిపోయారంటూ ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలా సమాచారం తెలుసుకోకుండా ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి చంద్రమోహన్ చనిపోయారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేకపోవడం, ఆయన క్షేమంగానే ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో సినిమాల ద్వార ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ నిండు నూరేళ్లు జీవించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.1966లో రంగులరాట్నం చిత్రంతో సినీ ప్రస్థానం ఆరంభించిన చంద్రమోహన్.. అప్పటి నుండి సహ నాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా చంద్రమోహన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. పదహారేళ్ళ వయసులో శ్రీదేవి, సిరిసిరిమువ్వతో జయప్రద తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికీ చంద్రమోహన్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.