సినిమా హీరోలు ఎవరైనా సరే.. ఎప్పటికప్పుడు తమ సినిమాల సంఖ్యని పెంచుకోవాలని, అదే టైంలో క్రేజ్ కూడా పెరగాలని తాపత్రయపడుతుంటారు. స్టార్స్ గా చెలమణీ అవుతున్న వాళ్లయితే.. తమ స్టార్ డమ్ ని నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇక తమ వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి.. స్టార్స్ చేయాలని చూస్తుంటారు. మనదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో వారసులు స్టార్స్ గా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు. తండ్రుల్ని వారసత్వాని నిలబెడుతున్నారు. అయితే చాలా తక్కువమంది మాత్రమే.. తమ వారసుల్ని ఇటువైపు రాకుండా చూశారు. అలాంటి వారిలో సోగ్గాడు శోభన్ బాబు ఒకరు. ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటనేది తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో శోభన్ బాబు పేరు చెప్పగానే మనకు సోగ్గాడు అనే పదమే ముందుగా గుర్తొస్తుంది. ఆయన కర్లింగ్ హెయిర్ కు అప్పట్లో అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉండేది. ఇక శోభన్ బాబు సినిమాల్లో స్వయంవరం, గోరింటాకు, సోగ్గాడు, దేవత లాంటివి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదంతా పక్కనబెడితే తెలుగులో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఓ విషయంలో మాత్రం చాలా ముందుచూపుతో వ్యవహరించారు. రోజురోజుకీ మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. అందుకే భూమిపై పెట్టుబడి పెట్టాలని ఫిక్సయ్యారు. దాన్నే రియాలిటీలో అమలు పరిచారు కూడా. అలా ఇప్పుడు ఆయన ఆస్తి కొన్ని వేలకోట్లు ఉంటుంది.
ఇక తెలుగు హీరోలు చేసే ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ గా ప్రస్తుతం రూ.50 కోట్లు, రూ.100 కోట్లు అని ఎంతో కొంత తీసుకుంటున్నారు. ఆస్తిని బాగానే కూడబెట్టుకుంటున్నారు. కానీ శోభన్ బాబుని మాత్రం క్రాస్ చేయలేకపోతున్నారనే చెప్పాలి. ఇక శోభన్ బాబు ఆస్తి గురించి ఈ మధ్య కాలంలో సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు చంద్రమోహన్ చాలా విషయాలు బయటపెట్టారు. చెన్నైలోని అన్నానగర్ ఏరియాలో చాలావరకు ఆస్తులు శోభన్ బాబువేనని చెప్పారు. అప్పట్లో దాదాపు 18 ప్రాపర్టీస్ చూడటానికే ఓ పూటంతా పట్టిందని చంద్రమోహన్ చెప్పారు. ఆ తర్వాత కాలంలోనూ చెన్నై వ్యాప్తంగా ఎన్నో చోట్ల భూములు, ఆస్తులు శోభన్ బాబు కొనుగోలు చేశారని చంద్రమోహన్ వివరించారు. చెన్నై మెయిన్ రోడ్ కు ఆనుకుని ఉన్న 30 ఎకరాల తోటని, హీరో మాధవన్ తాత దగ్గర నుంచి శోభన్ బాబు కొనుగోలు చేశారని, దానికోసం అప్పట్లోనే రూ.30 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ఆ ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇవ్వడం కోసం తన దగ్గరే రూ.2 లక్షల డబ్బుని శోభన్ బాబు అప్పుచేశాడని చంద్రమోహన్ చెప్పారు.
ఇక ఈ ఆస్తులన్నీ శోభన్ బాబు ఒక్కడే చూసుకోలేడు కాబట్టి.. ప్రాపర్టీస్ కు ఇంతమంది మేనజర్లు అని పెట్టుకున్నాడని చంద్రమోహన్ చెప్పారు. వీళ్లందరినీ చూసుకునేందుకు ఓ జనరల్ మేనేజర్ ఉండేవాడని అన్నారు. శోభన్ బాబుని ఆదర్శంగా తీసుకుని మురళీమోహన్, తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చామని చెప్పారు. ఇక వారసుల్ని ఇండస్ట్రీలోకి తీసుకురాని హీరోల్లో శోభన్ బాబు, మురళీమోహన్ మాత్రమే ఉన్నారని చెప్పిన చంద్రమోహన్.. కొడుకులకు తమ రియల్ ఎస్టేట్ బాధ్యతలు అప్పజెప్పారని తెలిపారు. అలా శోభన్ బాబు కొడుకు కరుణాకర్.. తండ్రి కూడబెట్టిన ఆస్తుల్ని చూసుకుంటూ వస్తున్నాడని చంద్రమోహన్ చెప్పారు. 1970ల్లో అన్నానగర్ లో ఎకరం రూ.5 వేల వరకు ఉండేదని, ఇప్పుడు ఆ ఎకరం భూమి రూ.50 కోట్లకు చేరింది. ఈ లెక్కన చూసుకుంటే సోగ్గాడు శోభన్ బాబు ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉంటాయి. మనం ఊహించడం కూడా కష్టమే. ఇక ఆయన మరణించే సమయానికి శోభన్ బాబు మొత్తం ఆస్తి విలువ రూ.80 వేల కోట్లపైనే అని సమాచారం. ఇప్పుడు ఆ నంబర్ ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఎప్పటికీ శోభన్ బాబుని మించిన రిచెస్ట్ హీరో లేనట్లే. మరి శోభన్ బాబు ఆస్తుల, వాటి విలువపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.