తెలుగు ఇండస్ట్రీలో తొలితరం హీరోలు యన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో పెప్పించిన హీరోలు కృష్ణ, శోభన్ బాబు అంటారు.. ఆ హీరోలతో సమాన స్థాయిలో మరో హీరో కూడా ఉన్నారు.. ఆయనే చంద్రమోహన్. చిన్నప్పటి నుంచి రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసిన చంద్రమోహన్ 1966 లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ చిత్రాలు చూసి ఇప్పటికీ ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు.
ఒకప్పుడు చంద్రమోహన్ కి ఇండస్ట్రీలో భలే క్రేజ్ ఉండేంది. అంతే కాదు ఆయన కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో అనే సెంటిమెంట్ కూడా ఉండేది. పదహారేళ్ల వయసులో శ్రీదేవి, సిరిసిరి మువ్వలో జయప్రద ఇంకా ఎంతోమంది మొదట ఆయన సరసన హీరోయిన్లుగా నటించినవారు కావడం విశేషం. హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తండ్రి, తాత పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన కెరీర్ లో 175 చిత్రాల్లో హీరోగా నటించి.. తర్వాత 900 చిత్రాలకు పైగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన హూమ్ టూర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెలబ్రెటీలు తమ ఇంటి నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్స్, తాము ఎంతో అపురూపంగా పెంచుకునే పక్షులు, జంతువులు, గార్డెన్ గురించి వివరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలకు సంబంధించిన హోమ్ టూర్ చేసిన సుమన్ టీవీ తాజాగా నటుడు చంద్రమోహన్ ని కలిశారు. ఈ సందర్భంగా చంద్రమోన్ ఆయన ఇంటికి సంబంధించిన విశేషాలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నటుడు చంద్రమోహన్ మాట్లాడుతూ.. ‘నా ఇంట్లో ఒక విలేజ్ వాతావరణం ఉండేలా చూసుకుంటాను.. మా ఇంట్లో వివిధ రకాల మొక్కలు ఉంటాయి.. అలాగే పక్షులు పెంచడం కూడా చాలా ఇష్టం.. ఇక్కడ ఏర్పాటు చేసిన బుద్ద విగ్రహం విదేశాల నుంచి తెప్పించాం.. ఇది మా ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది’ అన్నారు. ఈ సందర్భంగా నటి సుధ రావడంతో చంద్రమోహన్ ఎంతో సంతోషించారు. నటి సుధ, సుమన్ టీవి వారు చంద్రమోహన్ ఆయన సతీమణి జలంధర ను సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.