తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు చంద్రమోన్. ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. ఆయన కెరీర్ లో 175 చిత్రాల్లో హీరోగా నటించి.. తర్వాత 900 చిత్రాలకు పైగా విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రీవార్డులు అందుకున్న చంద్రమోహన్ ప్రస్తుతం వయోభారంతో ఇంటి వద్దనే ఉంటూ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఇటీవల సినీ సెలబ్రెటీలకు సంబంధించిన హూమ్ టూర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఎంతో మంది సెలబ్రెటీలకు సంబంధించిన హోమ్ టూర్ చేసిన సుమన్ టీవీ వారు చంద్రమోహన్ ని కలిశారు. ఆ సందర్భంగా ఆయన తన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అలాగే తన ఇంటి విశేషాల గురించి మాట్లాడారు. తన సతీమణి జలంధరను సుమన్ టీవి వారికి పరిచయం చేశారు చంద్రమోహన్. చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు.. ఆమె మంచి రచయిత్రి. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు.
ఈ సందర్భంగా నటుడు చంద్రమోహన్ సతీమణి జలంధర మాట్లాడుతూ.. ‘ఆయన నటించిన అన్ని చిత్రాలు నచ్చుతాయి.. ఒకప్పుడు ఆయనతో నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు ఉత్సాహం చూపించేవారు.. ఆయన లక్కీ హీరోగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆయన సతీమణిగా నాకు కూడా ఎంతో అదృష్టం కలిసి వచ్చింది.. ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకుంటే ఎంతో కలిసి వస్తుందని అంటారు. జనవరి ఫస్ట్ కు ఎంతో మంది వస్తుంటారు. ఆయన చేత్తో నాకు డబ్బు ఇవ్వడం వల్లనే నాకు మంచి స్టార్ రైటర్ గా పేరు వచ్చింది’ అన్నారు. తన సతీమణి మాటలు విన్న చంద్రమోహన్ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.