కొంతమంది సెలెబ్రిటీలు తమ ప్రియురాళ్లతో తరచుగా బయట కనిపిస్తూ పాపరజీలకు పని చెబుతూ ఉంటారు. వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా, ప్రముఖ సెలెబ్రిటీ జంట..
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్, సాబా ఆజాద్‌లు గత కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. భార్య సుహానా ఖాన్‌తో విడాకుల తర్వాత హృతిక్ సాబాతో సెటిల్ అయిపోయారు. ఈ జంట ఎప్పుడు చూసినా బయట కనిపిస్తూనే ఉంటుంది. ఈవెంట్లు, టూర్‌లు అంటూ బయట తిరుగుతూ ఉన్నారు. వీరికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని వైరల్‌గా కూడా మారుతూ ఉంటాయి. తాజాగా, హృతిక్ రోషన్, సాబా ఆజాద్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృతిక్ రోషన్, సాబా ఆజాద్ లిప్‌లాక్‌కు సంబంధించిన వీడియో అది. తాజాగా, ఈ జంట ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. కారులోంచి బయటకు దిగుతున్న సమయంలో హృతిక్ తన ప్రియురాలు సాబాను ముద్దాడారు.
అనంతరం కారులోంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు రాగానే ఆమె కూడా బయటకు వచ్చింది. హృతిక్, సాబాల లిప్‌లాక్ దృశ్యాలను అక్కడే ఉన్న పాపరజీలు వీడియో తీశారు. ఇక, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ జంట త్వరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ అంటుంటే.. పెళ్లి కాకుండా ఇలా విచ్చల విడిగా తిరగటం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారన్న దానిపై స్పష్టత లేదు. ఈ జంట కూడా తమ పెళ్లిపై ఎలాంటి సూచనలు ఇవ్వటంలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా లివ్‌ఇన్‌లో ఉండే అవకాశం ఉందన్న ప్రచారం కూడా నడుస్తోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.