స్నేహితుడి చేతిలో నవీన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కారణంగా ఈ ఘోరం జరిగింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు..
నవీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్యతో సంబంధం ఉందని భావించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరి మిత్రుడు హసన్‌ను పోలీసులు విచారించారు. విచారణలో హసన్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. హత్యకు ముందు హరి, నవీన్ మందు తాగి అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతానికి వచ్చారట. అక్కడ సదరు యువతితో తాను సహజీవనం చేస్తున్నట్లు హరి, నవీన్‌కు చెప్పాడట. ఇదే విషయాన్ని హసన్ పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, హత్య జరిగిన రోజు హరి తన ఇంటికి రావటంపై హసన్ మీడియాతో మాట్లాడుతూ..
‘‘ ఆ రోజు 12.20కి నాకు కాల్ వచ్చింది. హరి నాకు కాల్ చేసి బయటకు రమ్మన్నాడు. నేనే వాడ్ని నా దగ్గరకు రమ్మన్నాను. లేదు నువ్వే రా అన్నాడు. నేను వెళ్లి వాడిని కలిశాను. ఆ టైంకు బాడీ పార్ట్స్ పారేసి నా దగ్గరకు వచ్చాడు. ఏం జరిగిందో అంతా చెప్పాడు. నేను అతడి బట్టలపై బ్లడ్ మరకలు చూశా. ‘ఒక్కడ్నే చేసినా.. ముక్కలన్నీ పాడేసి వచ్చా’ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడిగా.. ఏం చేయాలో అర్థం అయితలేదు.. అని అన్నాడు. తర్వాత మా ఇంటికి వచ్చాడు. నా బట్టలు ఉంటే వేసుకోవటానికి ఇచ్చిన. నా రూములోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు.
తర్వాత ఇక్కడినుంచి వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ ఆ అమ్మాయిని కలిసిండంట. ‘నువ్వు ఎప్పుడైనా దొరికిపోవాల్సిందే. లొంగిపో’ అన్నాను. వాడు కూడా వాళ్ల నాన్నకు చెప్పి లొంగిపోతాను అన్నాడు. మేము ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్స్. వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు. హరికి గంజాయి, మందు అలవాటు లేదు. నవీన్‌కు గంజాయి అలవాటు ఉంది. ఆ అమ్మాయి ఈ విషయం తెలీదు’’ అని చెప్పాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించిన మరికొన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ యువతి మొదట నవీన్‌ను ప్రేమించిందట. తర్వాత అతడ్ని దూరం పెట్టి.. హరికి దగ్గరయ్యిందట.
ఈ విషయం నవీన్‌కు తెలిసి యువతికి ఫోన్లు, మెసేజ్‌లు చేయసాగాడు. నవీన్ సంగతి గురించి ఆ యువతి హరితో చెప్పలేదట. నవీన్ పదే పదే తన ప్రియురాలికి ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండటం హరికి తెలిసిందట. నవీన్ కారణంగా ప్రియురాలు తనకు దూరం అవుతుందని భావించిన హరి, నవీన్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడట. ఫిబ్రవరి 17 నవీన్ గొంతు నులిమి చంపి, అతడి శరీరాన్ని ముక్కలు చేసి పడేశాడు. ఆ ఫొటోలు, వీడియోలు ఆ యువతికి పంపించాడు. మరి, ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.