స్వల్పంగా తగ్గిన వెండి ధర
10గ్రా 22 క్యారెట్ 10 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,340.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,290.
1కిలో వెండి 68,200
బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 1 రూపాయి తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 1 రూపాయి తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గి 43 వేల 340 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గి 47 వేల 290 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 500 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1850 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1800 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 790 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,770 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,270 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,270 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,490 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49,590 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.