బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,770.
1కిలో వెండి 72, 000
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలో మార్పు లేదు. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 700 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 770 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 72 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 450 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 490 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 060 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,160 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,860 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,860 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,860 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,120 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.