ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చేస్తోంది. ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే కావడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టిన రోజు నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫ్యాన్స్ సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
అది కూడా ఒకటి, రెండు సర్ ప్రైజ్ లు కాదు.. ఏకంగా నాలుగు అప్డెట్స్ రానున్నాయి. ఈసారి చిరంజీవి పుట్టినరోజున మొత్తం నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారట. అందులో ప్రధానంగా ఆచార్య మూవీ నుంచి ఒక కొత్త పోస్టర్ విడుదల కానుంది. అంతే కాదు కుదిరితే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్ లో చెప్పే అవకాశం ఉంది.
ఇక మరో అప్డేట్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ గురించి. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ రీమేక్ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారు. నయనతార, సత్యదేవ్ వంటి ఇతర తారాగణం ఉంది. ఈ సినిమా అప్డేట్ కూడా ఆ రోజు ఉంటుందట.
మూడో అప్డేట్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు మెహెర్ రమేష్ నటిస్తున్న సినిమా గురించి. తమిళంలో హిట్టైన వేదాళం అనే సినిమా రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించనుంది. ఈ మూవీ నుంచి కూడా ఓ అప్డేట్ రానుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించనున్న మరో సినిమా బాబీ-మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అప్డేట్. డైరెక్టర్ బాబీ చెప్పిన కథకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. చిరంజీవి పుట్టిన రోజున ఈ సినిమా నుంచి కేవలం ఒక పోస్టర్ మాత్రం విడుదల చేయనున్నారని తెలుస్తోంది.