ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్ కు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు కానీ, మిగతా దేశాల్లో ఫుట్ బాల్ కు మంచి ఆధరణ ఉంది. సాధారనంగానే ఏ క్రీడ అయినా ఆడేది స్టేడియంలోనే. ఇక ఆటలకు వాతావరణం సహకరించాలు కూడా. ఎందుకంటే వాతావరణం అనకూలంగా లేకపోతే ఏ మ్యాచ్ అయినా రద్దు కావాల్సిందే.
ఆట ఏదైనా మొదలైనప్పుడు తప్పకుండా వాతావరణాన్ని ముందుగానే అంచనా వేస్తారు. కానీ,కొన్ని సార్లు హఠాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్తితులు ఎవ్వరికి అంతుపట్టవు. అతే సుడిగాలు లాంటి విపత్తులను అస్సలు అంచన వేయలేం. అంతే కాదు అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కూడా ముందుగా చెప్పలేము. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఏర్పడే సుడిగాలులు దుమారం రేపుతాయి. ఇదిగో ఇక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ను సుడిగాలి ఏంచేసిందో మీరే చూడండి.
బొలీవియాలోని అచోకాల్లా అట్టహాసంగా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఆటలో భాగంగా ప్లేయర్స్ అంతా గ్రౌండ్ లో వరుసగా నిలుచున్నారు. ఐతే ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. పెద్ద సుడిగాలి అక్కడికి కమ్ముకొచ్చింది. పెద్ద ఎత్తున దుమ్ము రేపుతూ ఫుట్ బాల్ ప్లేయర్స్ ను చుట్టుముట్టింది. క్రీడాకారులంతా సుడిగాలి దెబ్బకు చెల్లాచెదురయ్యారు.
మళ్లీ కాసేపట్లో ఆ సుడిగాలి మైదానం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత కాసేపటికి ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ ఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సుడిగాలి వీడియో చూసెయ్యండి.