భర్త మరొకరి వైపు చూస్తూనే తట్టుకోలేదు భార్య. అందుకే ఇరుగింటి పొరుగింటి మహిళల భర్తలను అన్నయ్యా, తమ్ముడు అని వరుసలు కలిపేస్తుంది. భర్త పర్మిషన్ లేకుండా ఆ మహిళల్ని ఆయనకు సోదరీమణుల్ని చేసేస్తుంది.
భర్త మరొకరి వైపు చూస్తూనే తట్టుకోలేదు భార్య. అందుకే ఇరుగింటి పొరుగింటి మహిళల భర్తలను అన్నయ్యా, తమ్ముడు అని వరుసలు కలిపేస్తుంది. భర్త పర్మిషన్ లేకుండా ఆ మహిళల్ని ఆయనకు సోదరీమణుల్ని చేసేస్తుంది. భర్త పరాయి స్త్రీ మోజులో పడిపోయి తనను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడన్న భయంతోనే ఎప్పటికప్పుడు అతడిపై ఓ నిఘా నేత్రాన్ని ఉంచుతుంది భార్య. చిన్నపాటి డిటెక్టివ్ పాత్ర పోషిస్తుంది. అయినా సరే.. మగబుద్ది ఎక్కడకు పోతుంది. ఏదో ఒక సమయంలో బయటపడాల్సిందే కదా. తన భార్య కళ్లు కప్పి, మరో మహిళకు లైన్ వేసి.. అవరమైతే అత్యంత రహస్యంగా కాపురం పెట్టేస్తాడు. ఇది తెలిసిన తర్వాత భార్య చేతిలో భర్త, అతడి రెండో భార్య తన్నులు తినడమో.. లేదంటే న్యాయ పరంగా విడిపోవడమే చేస్తుంటారు. ఇదే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో.
వివరాల్లోకి వెళితే..ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఖాసిం అలీ అనే వైద్యుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అతడి మొదటి భార్య అయేషా, కాగా రెండో భార్య ఫరా అంజుమ్. ఈ నెల 26న భర్త క్లినిక్‌లో ఉన్న రెండో భార్యపై మొదటి భార్య అయేషా, ఓ మహిళల బృందంతో వచ్చి చితకొట్టింది. ఆమెను ఆ మహిళా బ్యాచ్ మొత్తం కర్రలతో దారుణంగా కొట్టారు. ఇవన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. స్థానికులు ఫరా కేకలు విని, క్లినిక్‌కు వచ్చి బాగా ఆమెను సమీపంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఫరా అంజుమ్ సీసీటీవీ క్లిప్‌తో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త ఖాసీం అలీ, అతని మొదటి భార్య అయేషా, ఆమె స్నేహితులు ఫర్జానా, గుల్షన్, నోమన, సైమా, సిమ్రాన్, నవీసాలపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే పోలీసులు ఫిర్యాదు నమోదు చేశామని ఉన్నతాధికారి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.