ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లిన కాబోయే భార్యభర్తలకు చుక్కెదురైంది. జలపాతంలో షూట్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ఆ జంటతో పాటు మరి కొంతమంది చిక్కుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రావత్‌భటా జిల్లాలోని చులియా జలపాతం వద్ద కాబోయే భార్యాభర్తలు ప్రీ వెడ్డింగ్ ఫూట్ కోసమని వెళ్లారు. ఇక ఆ అందమైన జలపాతంలో ఫోటో షూట్ చేస్తున్నారు. అంతలోనే జలపాతం నీటి ప్రవాహం క్రమ క్రమంగా పెరగటంతో ఫోటో షూట్ చేస్తున్న అందరూ కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఇక
ఏం చేయాలో తెలియక కేకలు, అరుపులతో హెల్ప్ మీ.. అంటూ అరిచారు. ఇక స్పందించిన స్థానికులు రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించటంతో హుటాహుటిన అక్కడకి చేరుకున్నారు. దీంతో జలపాతంలో చిక్కుకున్న అందరినీ కాపాడారు. ఇక విషయం ఏంటంటే..? ఫోటో షూట్ జరుగుతున్న సంగతి తెలియక రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్‌లోని నాలుగు గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతో ఉన్నపళంగా నీటి ప్రవాహం పెరిగటంతో వారు అందులోనే చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లింట్లో కాస్త వైరల్ గా మారింది.