వర్షాకాలం మొదలైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ప్రకృతి పచ్చ చీర కట్టి రమణీయంగా కనిపిస్తుంది. దీంతో వీకెండ్స్, ఇతర సెలవులు వస్తే.. అలా ట్రెక్కింగ్ లేదా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ వేసుకుంటారు.
కర్ణాటక రాష్ట్రం నుండి సుమన్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్స్‌కర్షన్‌కి వెళ్లాడు. అందులో భాగంగా తలకోన జలపాతం సందర్శించుటకు వెళ్లారు. జలపాతం చూడముచ్చటగా ఉండడంతో ఈతకు దిగారు. అందులో ఓ కుంటలో సుమన్ ఈత కొడుతున్న సమయంలో అతని తల బండరాళ్లలో ఇరుక్కుపోయి చనిపోయాడు.
ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లిన కాబోయే భార్యభర్తలకు చుక్కెదురైంది. జలపాతంలో షూట్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ఆ జంటతో పాటు మరి కొంతమంది చిక్కుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రావత్‌భటా జిల్లాలోని చులియా జలపాతం వద్ద కాబోయే భార్యాభర్తలు ప్రీ వెడ్డింగ్ ఫూట్ కోసమని వెళ్లారు. ఇక ఆ అందమైన జలపాతంలో ఫోటో షూట్ చేస్తున్నారు. అంతలోనే జలపాతం నీటి ప్రవాహం క్రమ క్రమంగా పెరగటంతో ఫోటో షూట్ […]