తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత 2016 డిసెంబర్ 5 మరణించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మరణం ఇప్పటి మిస్టరీగానే ఉంది. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. ఆర్ముగస్వామి కమిషన్.. ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈ నెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమాన్లు జారీ అయ్యాయి.
తమిళ ప్రజలు జయలలితను అమ్మ, పురుచ్చితలైవి అంటూ ప్రేమగా పిలుచుకునే వారు. వరుసగా రెండవ సారి 2016 లో అధికారం చేపట్టారు. అయితే రెండవ సారి సీఎం అయిన కొద్ది నెలలకే జయలలిత అనారోగ్య పాలయ్యారు. దీంతో ఆమె 2016 సెప్టెంబరు 22న అర్ధరాత్రి చెన్నైలో చేరారు. అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఆసుపత్రిలోనే మృతి చెందారు. అయితే, జయలలిత అనారోగ్యం నుంచీ ఆసుపత్రిలో చికిత్స, మరణం వరకూ అనేక సందేహాలు ప్రజల్లో నెల్లకొన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి అన్నాడిఎంకే ప్రభుత్వం ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. ఈ విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది.
ఇటీవల అధికారం చేపట్టిన డీఎంకే ప్రభుత్వం సైతం కమిషన్ పదవీ కాలం పొడగించి విచారణను వేగవంత చేయాలని ఆదేశించింది. గత నెలలో ఎయిమ్స్ వైద్యలతో ఈ కమిషన్ బృంద సమావేశమైంది. విచారణను వేగవంతం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాడికి కమిషన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. మరి కమిషన్ అపోలో వైద్యులక సమాన్లు జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.