ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగ దిగిన ఫోటో షూట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాతీయస్థాయిలో ఇదొక చర్చనీయాంశం అయింది. నెటిజన్లు రణవీర్ సింగ్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 22న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇంటీవల ఓ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోషూట్‌తో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రణవీర్ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు అందగా, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రణ్వీర్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు ముంబయి పోలీసులు. ముంబాయిలో ఆయనకు సమన్లు ఇవ్వడానికి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని తెలిసింది.
ఆగస్టు 16 న ముంబాయికి వస్తానని రణ్వీర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మరోసారి రణవీర్ సింగ్ నివాసానికి వెళ్లి సమన్లు అందించాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఆగస్టు 22న చెంబూరు పోలీస్ స్టేషన్ లో రణవీర్ ను విచారించనున్నారు. జులై 26న ముంబయిలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ ఎన్జీఓ సంస్థ ఈ కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.