క్రికెట్ అందరికి ఇష్టమైన ఆట. అందరూ చాలా ఇష్టంగా ఆడే ఆట కూడా. కానీ.., నిజం చెప్పాలంటే ఇంటెర్నేషనల్ క్రికెట్ లో ఉండే చాలా రూల్స్ మనలో చాలా మందికి తెలియవు. ముఖ్యంగా నో బాల్స్ విషయంలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. తాజాగా ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ సీన్ ఒకటి క్రియేట్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
జైపూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ బౌలింగ్ లో గఫ్టిల్ ఔట్ అయిన తీరు అందరిలో కాస్త అనుమానాన్ని రేకెత్తిస్తోంది. సైడ్ లైన్ కి దీపక్ చాహర్ లెగ్ టచ్ అయినా, అంపైర్ ఎందుకు అవుట్ ఇచ్చాడన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే.. మీకు తెలుసా? ఈ నిర్ణయం సరైనదే. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మ్యాచ్ 17 వ ఓవర్ లో దీపక్ చాహర్ బౌలింగ్ కి వచ్చాడు. దీపక్ చాహర్ మొదటి బాల్ ని గుల్ లెంత్ లో వేయగా, గఫ్టిల్ దాన్ని భారీ సిక్సర్ గా మలిచాడు. అయితే.. ఇక్కడే చాహర్ కాస్త తెలివిగా ఆలోచించాడు. తరువాత బంతిని వికెట్స్ కి కాస్త పక్కాగా వచ్చి, స్లో బాల్ వేశాడు. ఈ కిటుకు ఫలించి గఫ్టిల్ లాంగ్ ఆన్ లో అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కానీ.., ఆ సమయంలో దీపక బ్యాక్ ఫుట్ సైడ్ లైన్ కి తగిలినట్టు స్పష్టంగా అర్ధం అయ్యింది.
ఫీల్డ్ అంపైర్ కూడా ఈ విషయంలో థర్డ్ అంపైర్ ని సంప్రదించాడు. కానీ.., చివరికి గఫ్టిల్ ని అవుట్ గానే ప్రకటించాడు. దీనికి కారణం ఏమిటంటే.. సైడ్ నోబ్ ని “ఫస్ట్ ఫుట్ ల్యాండ్” అన్న రూల్ ప్రకారం చూస్తారు. అంటే.. ఫుట్ ల్యాండ్ అయినప్పుడు లైన్ కి టచ్ అయితేనే ఆ బాల్ నోబాల్. తరువాత టచ్ అయితే.. దాన్ని నో బాల్ గా ప్రకటించరు. ఇప్పుడు దీపక్ చాహర్ వేసిన బాల్ విషయంలో జరిగింది కూడా ఇదే. దీపక్ ఫుట్ ల్యాండింగ్ సరిగ్గానే జరిగింది. ఆ తరువాతే లెగ్ సైడ్ లైన్ కి టచ్ అయ్యింది. ఇందుకే అంపైర్ దీన్ని ఔట్ గా ప్రకటించాడు. మరి.. ఇప్పుడు ఈ రూల్ మీకు అర్ధం అయింది కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
— bade raja (@baderaja04) November 18, 2021