అది తమిళనాడులోని రామనాథపురం జిల్లా కీలకుళం పంచాయితీలోని కేలాల్ గ్రామం. కనిమొళి, వినోబ రాజన్ అనే భార్యభర్తలకు నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది. దీంతో వారు కలిసి మెలిసి అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు. ఇక వీళ్లతో పాటు ఉంటున్నారు కనిమొళి మామ మురుగేశన్. రోజులు గడుస్తుండటంతో కోడలిపై కన్నేసి మురుగేశన్ ఆమెను లోబర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశాడు.
ఈ విషయాన్ని గ్రహించిన కోడలు కనిమొళి కొంత కాలం పాటు అలాగే గడిపింది. దీంతో రోజు రోజుకు మామ లైంగిక వేదింపులు హద్దులు దాటుతున్నాయి. ఏం చేయాలో తెలియక కోడలు తికమకలో పడింది. ఇదే విషయాన్ని భర్త వినోబ రాజన్‌కు చేర వేసింది. ఇతడు విని విననట్లుగా వదిలేశాడు. కనిమొళికి మామ వేదింపులు మాత్రం తగ్గట్లేదు. ప్రతీ రోజు ఏడుస్తూ ఏదో దిగులుగా ఉండేది. మామ వేదింపులు శృతి మించటంతో ఓ నిర్ణయానికి వచ్చింది.
దీంతో తన భర్తకు తెలియకుండా మామను హతమార్చాలనుకుంది. వేసిన స్కెచ్‌ను ఎలా అమలు చేయాలో పతకం రచించింది. ఇక ఒక రోజు ఇంట్లో భర్త లేకపోవటంతో అన్నంలో విషం కలిపి మామకు తినిపించింది కోడలు కనిమొళి. దీంతో మామ మరణించటంతో అంతా సహజ మరణం అని భావించారు. ఆ తర్వాత అంత్యక్రియులు కూడా జరిగి పోయి అంతా మాములై పోయింది. ఇక లోలోపల ఈ విషయాన్ని తనలోనే ఉంచుకోని కనిమొళి కుమిలిపోయి అందరికి చెప్పాలనుకుంది. కాగా ఈ విషయాన్ని ఒక రోజు గ్రామంలోని అధికారులకు చేరవేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం అందించటంతో కోడలు కనిమొళిని అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.