తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన గబ్బిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె వెంట భర్త కేసీఆర్, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు(కేసీఆర్) సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప్రతికి తరలించారు. శోభ వెంట భర్త కేసీఆర్, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేపడుతున్నారు. చికిత్స కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సుమారు 8 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే.. ఆమె తల్లి అస్వస్థతకు గురయ్యారు.
కెసీఆర్ దంపతులకు ఇద్దరు పిల్లలు కవిత, తారకరామారావు (కేటీఆర్) . వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఐటి శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండగా, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆదివారం శోభ అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్త తెలిసి పలువురు మంత్రులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం. శోభ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.