ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు. చిరంజీవి హీరోగా, ఆయన సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై నిర్మిస్తున్న సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ ‘గాడ్ ఫాదర్’ టైటిల్ లుక్ను చేసింది.
‘గాడ్ ఫాదర్’ టైటిల్ లుక్ లో చిరంజీవి కొత్తగా కనిపిస్తున్నారు. కోటు వేసుకుని, తలకు టోపి పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని వెనక్కి తిరిగి ఓ పకక్కు చూస్తూ నిటబడి ఉన్నారు చిరంజీవి. గాడ్ ఫాదర్ టైటిల్లో ఏ అనే అక్షరం మధ్యలో చిరంజీవి గన్ పట్టుకుని నిలబడి ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ షెడ్యూల్లో ‘గాడ్ ఫాదర్’ సినమాకు సంబందించిన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ప్రముఖ దర్శఖుడు మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ ‘గాడ్ ఫాదర్’ కు మ్యూజిక్సం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమన్ కాంబినేషన్లో వస్తున్న ‘గాడ్ ఫాదర్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ‘గాడ్ ఫాదర్’ టైటిల్ లుక్ రిలీజ్ తో పండగ చేసుకుంటున్నారు.
Presenting the Supreme Reveal of Megastar @KChiruTweets in a never seen before avatar as #GodFather🔥@jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman @sureshsrajan#Chiru153 #HBDMegaStarChiranjeevi pic.twitter.com/e9BYCwQz7b
— Konidela Pro Company (@KonidelaPro) August 21, 2021