ఓ నటి ఊహించని మోసానికి పాల్పడింది. ఏకంగా పెళ్లి జరిగినా కూడా కాలేదన్నట్టుగా నటించి ఓ వ్యక్తిని నిండా ముంచింది. అందాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా రూ. 30 లక్షలు విలువ చేసే నగలు, నగదు తీసుకుని చీటింగ్ కు పాల్పడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్. ఇదే ప్రాంతానికి చెందిన ఆనంద రాజా అనే వ్యక్తి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు. ఇందులో ప్రకృతి దృశ్యాలు, పలు కవితలను వీడియోలుగా మార్చి అప్‌లోడ్ చేస్తుండేవాడు. అయితే తాను రాసుకున్న కవితలన వాయిస్ ఓవర్ అందించడానికి, నటించడానికి తాటి కొంబు ప్రాంతానికి చెందిన దివ్యభారతి (24) అనే మహిళను నియమించుకున్నాడు. ఫోటోలు, కవితలను వాయిస్ ఓవర్ చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే ఆనంద రాజా ఆమెపై మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో అతని ప్రేమను దివ్యభారతి కూడా అంగీకరించి అతనితో చెట్టా పట్టాలేసుకుని తిరిగింది.
అయితే ఇది వరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిన దివ్యభారతి ఆనంద రాజా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే సరికి ఏదో ఒక సాకు చెప్పి మరిచిపించేది. ఆమె ప్రేమలో మునిగిపోయిన ఆనంద రాజా ఆమె కోరినంత డబ్బు, నగలు ఇచ్చేవాడు. అలా దివ్యభారతి ఆనంద రాజా నుంచి దాదాపుగా రూ.30 లక్షల విలువ చేసే నగలు, బంగారం లాగేసింది. ఇక కొంత కాలానికి దివ్యభారతికి పెళ్లి అయిందనే నిజాన్ని తెలుసుకున్న ఆనంద రాజా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. నన్ను మోసం చేశావా అంటూ కుమిలిపోయాడు. ఇక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి దివ్యభారతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా అందం పేరుతో ప్రేమిస్తున్నానని నటించి ఏకంగా చీటింగ్ కు పాల్పడ్డ దివ్య భారతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.