హైదరాబాద్: అహ్మద్ నగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో హైడ్రాలిక్ రోలర్‌ను విరాళంగా అందిచారు. సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యకలాపాలలో భాగంగా మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సిఎఫ్)కు హైడ్రాలిక్ రోలర్‌ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ రీజియన్ -2 డీజీఎం భాస్కర్ చక్రవర్తి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఎస్‌సిఎఫ్‌తో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ” అన్నారు. “స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సిఎఫ్) వ్యవస్థాపక-కార్యదర్శి కె.సాయిబాబా ఎంతోమంది నిరుపేద పిల్లలకు, యువ ప్రతిభావంతులకు పలు క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని” భాస్కర్ చక్రవర్తి పేర్కొన్నారు. పిల్లల్లో స్పోర్ట్స్ కల్చర్ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన చెప్పారు.
అనంతరం రూ.2 లక్షల విలువచేసే హైడ్రాలిక్ రోలర్‌ను విరాళంగా అందించిన కెనరా బ్యాంకు అధికారులకు కె.సాయిబాబా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ నగర్ బ్రాంచ్ మేనేజర్ జె.అనూష, కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్-2 సిఎస్‌ఆర్ ఇన్షియేటివ్ ఆఫీసర్ పి.హేమ బిందు తోపాటు ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.