దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న వేళ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మేలు చేసే ప్రకటన చేసింది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు అదిరే శుభవార్త అందించింది. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న వేళ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు మేలు చేసే కీలక ప్రకటన చేసింది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నవారికి, తీసుకోవాలని భావిస్తున్న వారికి భారీ ఊరట కలుగనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. ఆ వివరాలు..
కెనరా బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో వెహికల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి భారీ ప్రయోజనం చేకూరనుంది. రుణ రేట్లు తగ్గింపు నేపథ్యంలో ప్రస్తుతం గృహరుణాలపై వడ్డీ రేటు 8.55 శాతం నుంచి మొదలవుతోంది. అలాగే 4 వీలర్ వాహనాల రుణాలపై వడ్డీ రేటు 8.8 శాతం నుంచి మొదలవుతుండగా, 2 వీలర్ వాహనాలపై వడ్డీ రేటు 11.35 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలావుంటే, కొద్ది రోజుల క్రితం మానిటరీ పాలసీ నిబంధనలు, ఇతర రూల్స్ ఉల్లంఘించినందుకుగానూ ఆర్‌బీఐ కెనరా బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.2.92 కోట్లు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్‌తో వడ్డీ రేట్లను లింక్ చేయకపోవడం, అర్హత లేని సంస్థల పేరుపై సేవింగ్స్ అకౌంట్లు తెరవడం వంటి బ్యాంకు నిబంధనలు కెనరా బ్యాంక్ అతిక్రమించినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ కారణంతోనే భారీ జరిమానా విధించినట్లు తెలిపింది.