ఇంటర్నేషనల్ డెస్క్- సాధారనంగా ఎవరైనా తప్పు చేస్తే వారికి కోర్టులు శిక్ష వేసి జైలుకు పంపిస్తాయి. జైళ్లో ఉన్నన్నాళ్లు వారిలో మార్పును తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తారు. చాలా మంది జైలుకు వెళ్లి, బయటకు వచ్చాక మారిపోతే, మరి కొంత మంది మాత్రం మరింత క్రూరంగా తయారవుతారు. ఐతే ఖైదీల్లో మార్పు తీసుకురావాల్సిన అధికారులే తప్పు చేస్తే.. ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాగే జరిగింది. ఖైదీల్లో మానసిక పరిపక్వత తీసుకురావాల్సిన అధికారే విచ్చలవిడిగా ప్రవర్తించింది. అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలోని ప్రెస్నో కౌంటీలోని 26 ఏళ్ల టీనా గొంజలెజ్ 2016 నుంచి కరెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఆమె ఖైదీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి పరివర్తనలో మార్పు తేవాల్సి ఉంటుంది.
కానీ టీనా మాత్రం తన భాద్యతలను మరిచి ఖైదీలతో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు సాగించేది. ఈ క్రమంలో ఒకసారి 11 మంది ఖైదీలతో బహిరంగ శృంగారంలో పాల్గొంది. ఇతర ఖైదీలు చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అంతే కాదు జైల్లోని ఖైదీలకు రహస్యంగా సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు సరఫరా చేసేది. ఇక ఖైదీలతో బయటకు చెప్పుకోలేని భాషలో మాట్లాడేదట టీనా. పైగా తాను చేసే శృంగార కార్యకలాపాల గురించి అందరికి గొప్పగా చెప్పుకునేది.
ఈ విషయాలన్నీ కాస్త ఆలస్యంగానైనా బయటపడడంతో ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి బహిష్కరించి అరెస్ట్ చేశారు. టీనా గొంజలెజ్ ప్రవర్తన గురించి విని షాక్ అయిన న్యాయమూర్తి, ఆమెకు రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ తాను చేసింది తప్పని టీనా ఒప్పుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.