ప్రేమ.. రెండు అక్షరాల స్వచ్ఛమైన భావన ఇది. నిజమైన ప్రేమ సుఖాన్ని కోరుకుంటుందే గాని.., ద్వేషాన్ని కాదు. కానీ.., ఇప్పుడు ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని రగిలిపోయాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తన ప్రియురాలిని దక్కించుకోవాలని చేతబడి చేయించాడు. సభ్య సమాజం నివ్వెరపోయే ఈ ఘటన రంగారెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మురళి అనే యువకుడికి కొన్ని నెలల క్రితం ఓ రాంగ్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఓ అమ్మాయి. అప్పటి నుండి వారిద్దరి మధ్య స్నేహం మొదలయింది. ఇద్దరూ గంటల పాటు ఫోన్ లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. బయట కూడా స్నేహంగా తిరిగారు. దీంతో.., ఆ యువతి తనని ప్రేమిస్తుందని మురళి నమ్మాడు. ఆమె తనకే సొంతం అని ఎన్నో ఊహించుకున్నాడు. ఓరోజు తనకి దైర్యంగా ప్రపోజ్ చేశాడు. కానీ.., ఆ అమ్మాయి మురళి ప్రేమని తిరస్కరించింది. తనది కేవలం స్నేహం మాత్రమే అని తేల్చి చెప్పింది. అప్పటి నుండి మురళిని దూరం పెట్టింది సదరు యువతి.
తరువాత కాలంలో ఆమెకి పెళ్లి అయిపోయింది. మంచి సంబంధం రావడంతోనే తన ప్రియురాలు తనని మోసం చేసినట్టు మురళి అనుకున్నాడు. ఆమెకి ఎలా అయినా గుణపాఠం నేర్పాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మురళీ తరచూ ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. ఈ విషయంలో పెద్దలు మురళికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. దీంతో.., ఇలా అయితే తన ప్రియురాలిని ఏమి చేయలేనని భావించిన మురళి క్షుద్ర పూజలను ఆశ్రయించాడు.
ఓ మంత్రగాడిని తీసుకొచ్చి అమ్మాయి ఇంటి ముందు ఏకంగా చేతబడి చేపించాడు. ఎముకలు, కుంకుమ, జీడిగింజలు, గవ్వలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, వక్కలు, తెల్ల , నల్లటి గుడ్డ ముక్కలు , బియ్యం వంటి క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను ఇంటి ముందు ఉంచి నానా రచ్చ చేశాడు. వీటిని చూసిన కుటుంబీకులు భయాందోళనకు గురై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారణ ప్రాంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఇదంతా చేసింది మురళి అని తేల్చి.., అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరి.., ప్రియురాలిపై చేతబడి చూపించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.