బిచ్చగాడు అంటే సమాజంలో ఒక చిన్న చూపు ఉంటుంది. అతన్ని చాలా మంది మనిషిగా కూడా గుర్తించరు. కానీ.., ఇప్పుడు ఆ బిచ్చగాడే తన ప్రాణాలకి తెగించి నలుగురు చిన్నారులను కాపాడాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., రాజంపేట మండలంలోని కుమ్మరపల్లె గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. వారితో పాటు, మరికొంత మంది ఉన్నా, వారంతా ఒడ్డునే ఆగిపోయారు. మిగిలిన ఐదుగురు విద్యార్ధులు గుంతలోకి దిగారు. ఇసుక కోసం కోసం తీసిన ఈ గుంతల్లో.., ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీగా నీరు చేరింది.
ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ విద్యార్థులు లోపలకు కూరుకుపోయారు. దీంతో.., మిగతా స్నేహితులు భయంతో కేకలు వేశారు. పిల్లల అరుపులు ఉన్న ఓ బిచ్చగాడు అటుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలు విషయం తెలుసుకుని ఆ గుంతలోకి దూకి పిల్లలను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ బిచ్చగాడు తన ప్రాణాలకి తెగించి నలుగురు పిల్లలని బయటకు తీసుకొచ్చాడు. కానీ.., ఆదిత్య (16) అనే పిల్లాడిని మాత్రం కాపాడలేకపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ కూడా ఈ మధ్య కాలంలోనే కన్నుమూసినట్టు తెలుస్తోంది. భర్త చనిపోయి, ఉన్న ఒకగానొక్క కుమారుడు ఇలా కన్ను మూయడంతో అతని తల్లి శైలజ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అయితే.., తనకి ఊపిరి అందకుండా, ఆయాసం వస్తున్నా, పట్టు విడవకుండా ప్రయత్నించి నలుగురు పిల్లలని కాపాడిన బిచ్చగాడిని మాత్రం అంతా రియల్ హీరోగా కీర్తిస్తున్నారు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.