బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ నాట తీవ్ర విషాధం నింపింది. పునీక్ అకాల మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమతో పాటు, యావత్తు భారత సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ రాజ్ కుమార్ అభిమానులైతే శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ లేని విషయాన్ని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
పునీత్ మరణం పట్ల ఇంతలా కన్నడనాడు కదిలిపోవడానికి ఆయన హీరో అని మాత్రమే కాదు, పునీత్ చేసే సేవా కార్యక్రమాలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎన్నో ఆనాధాశ్రమాలు, విధ్దాశ్రమాలు, నిరుపేద విధ్యార్ధులకు చదువు చెప్పిండటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు పునీత్. ఇదిగో ఇటువంటి సమయంలో ఆయన మరణం అందరిని కలిచివేసింది.
తన సేవా కార్యక్రమాలు తన తరువాత కూడా ఆగిపోకూడదని, ఎంతో ముందు చూపుతో తన ఛారిటీ కోసం 8 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు పునీత్ రాజ్ కుమార్. ఆయన దూరదృష్టికి అంతా ప్రశంసిస్తున్నారు. ఇదిగో ఈ సందర్బంగా పునీత్ రాజ్‌కుమార్ కు ‘బసవశ్రీ’ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మురుఘ మఠం నిర్ణయించింది. బసవ జయంతి రోజు ఈ పురస్కారాన్ని పునీత్ కుటుంబ సభ్యులు ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.
బసవశ్రీ పురస్కారం కింద 5లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేయనున్నారు. ఈ నెల 10న మురుఘ మఠాధిపతి శివమూర్తి శివాచార్య స్వామిజీ బెంగళూరు సదాశివనగర్ లోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఆ సందర్బంగా ‘బసవశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ పురస్కారం కింద అందించే 5 లక్షల రూపాయలను పునీత్ నిర్వహణలోని వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలకు కేటాయించనున్నారని సమాచారం.