ప్రేక్షకుడిని మెప్పించగలిగేలా కాన్సెప్ట్, నటన ఉంటే థియేటర్లకు పదిసార్లు వచ్చి సినిమాను చూసే పిచ్చి అభిమానులు ఉన్నారు. నచ్చకపోతే లోపాలు ఎత్తి చూపుతుంటారు. అది వినోదం కోసమేనన్న విషయం మర్చిపోయి.. ఆ క్యారెక్టర్లను తమతో పాటు మోసుకెళుతుంటారు.
సినిమాలు చూసి అందులో హీరోహీరోయిన్ క్యారెక్టర్లు, డ్యాన్సులు,ఫైట్లు గురించి మాట్లాడుకోవడం కామన్. ప్రేక్షకుడిని మెప్పించగలిగేలా కాన్సెప్ట్, నటన ఉంటే థియేటర్లకు పదిసార్లు వచ్చి సినిమాను చూసే పిచ్చి అభిమానులు ఉన్నారు. నచ్చకపోతే లోపాలు ఎత్తి చూపుతుంటారు. అది వినోదం కోసమేనన్న విషయం మర్చిపోయి.. ఆ క్యారెక్టర్లను తమతో పాటు మోసుకెళుతుంటారు. అయితే ఒక్కోసారి సినిమా చూసి అతిగా స్పందిస్తుంటారు అభిమానులు. ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. అలా స్పందించారు అంటే ఆ నటీనటులు అంత బాగా నటించి ఉండాలి. అలా రియాక్ట్ అవుతున్న సినిమాల్లో ఇటీవల వచ్చిన మూవీ బేబి. ఇందులో హీరోలకు పాజిటివ్ మార్కులు పడుతుంటే.. హీరోయిన్‌కు మాత్రం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. దీనిక్కారణం ఈ సినిమాలో ఆమె చేసిన నటన.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్రలుగా తెరకెక్కిన సినిమా బేబి. ఈ సినిమా ఈ నెల 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడమే కాదూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తమను తాము ఫీల్ అవుతారంటూ చిత్ర యూనిట్ చెప్పినట్లుగానే ఉంది ఈ సినిమా. ఇందులో నటించిన హీరో, హీరోయిన్లకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అభిమానులు వైష్ణవి క్యారెక్టర్ ను ఓన్ చేసుకుని.. ఆమెను దూషించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పురుషులు.
అందులో ఆమె క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండటంతో పాటు.. ఇప్పటి అమ్మాయిల తీరుకు అద్ధం పట్టినట్టు కనిపిస్తుంది. దీంతో అబ్బాయిలు ఆ అమ్మాయిని విపరీతంగా తిట్టిపోతున్నారు. ఇక ఆమె పోస్టర్ కనిపిస్తే.. చాలు విరచుకుపడుతున్నారు. ఇప్పుడు అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా చూసిన ఓ అభిమాని, ఏకంగా చెప్పు తీసి..సినిమా కటౌట్ లో ఉన్న వైష్ణవి ఫోటోపై దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆమెను తిడుతూ ఆమె క్యారెక్టర్ పట్ల కనెక్ట్ అయిపోయాడు. ఇది సినిమా రా నాయనా.. చూసి వదిలేయాలి కానీ.. ఇలా రియాక్ట్ కావడం ఏంటని కొందరు భావిస్తున్నారు.