అమ్మ.. ఓ జన్మ మొత్తానికి సరిపడే ప్రేమని పంచే బంధం. ఆమె ఒడిలో తల పెట్టికుంటే చాలు.. ఎన్ని సమస్యలు ఉన్నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. పుట్టాక ముందు కడుపులో, పుట్టాక కళ్ళలో పెట్టుకుని బిడ్డని కాచే ఆ తల్లి ప్రేమ ముందు ఎన్ని బంధాలైన సరిపోవు. సరి తూగవు. కానీ.., పసి ప్రాయంలోనే ఆ అమ్మ దూరమైతే, అప్పటి వరకు పాలు పట్టి ఆకలి తీర్చిన ఆ అమ్మ.. జీవిచ్చంలా కళ్ళ ముందే పడిపోతే.. ఊహ తెలియని చిన్నారికి సైతం ఆ బాధ అర్ధం అవుతుంది. అమ్మని తప్ప ఇంకెవ్వరిని గుర్తు పట్టలేని ఆ పసి హృదయం తాను ఒంటరినై పోయాన్న బాధతో విలవిలలాడిపోతుంది. అచ్చం ఇలాంటి హృదయ విదారకర ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇది చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం!
కునసోతు విజయ్,లక్ష్మీ ప్రియా (20) దంపతులు. పెళ్లైన నాటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంటకు ఏమిదినెలల క్రితం పండంటి పాప జన్మించింది. ఆ పాపను ఎంతో మురిపంగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో పాపకు కాళ్ల పట్టీలు కొని ఇవ్వాలని భర్తను భార్య కోరింది. తన చిన్నారి పాపకు పట్టీలు చేయిస్తే ముద్దుగా ఉంటుందని ఆ తల్లి కోరిక. భార్య ముచ్చట తీర్చేందుకు భర్త వారిని అశ్వారావుపేట తీసుకువెళ్తానన్నాడు. కానీ.., అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఆ ప్రయాణం వల్లే విషాదం చోటు చేసుకుంది.
ఇది చదవండి: ప్రేమ పేరుతో యువకుడు వేధింపులు.. హద్దులు మీరడంతో..
బాలింతరాలైన లక్ష్మి ప్రియ, ఆమె భర్త విజయ్.. తమ కుమార్తెని తీసుకుని బండిపై అశ్వారావుపేటకి బయలు దేరారు. కానీ.., వీరిని ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో వెంటాడింది. స్పీడ్ గా దూసుకొస్తున్న వేరే బస్సును తప్పించే క్రమంలో.. ఎదురుగా వస్తున్న రాజమండ్రి డిపో కి చెందిన AP 05 Z 5034 నెంబరు గల ఆర్టీసీ బస్సు.. విజయ్, లక్ష్మీ ప్రియ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో.. తల్లి లక్ష్మీ ప్రియ అక్కడిక్కడే కన్నుమూసింది. భర్త విజయ్, కుమార్తె మాత్రం ప్రమాదం నుండి బయట పడ్డారు. కానీ.. తల్లి శవం వద్ద కూర్చొని ఆ 8 నెలల పసికందు పాల కోసం విలపిస్తున్న దృశ్యం అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. తన తల్లి ఎంతటికి లేవకపోవడంతో అమ్మ కొంగు పట్టుకుని లాగుతూ ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడవడం అందరిని కదిలించి వేసింది. చూశారు కదా? డ్రైవింగ్ చేసే సమయంలో ఓ క్షణం అలసత్వంగా ఉన్నా.., ఎంతటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో..? మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.