టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ మద్య సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారు.. గిఫ్ట్ ఇస్తాం మీ వివరాలు చెప్పండి అంటూ కొంత మంది అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. అలా తమ వలలో పడ్డవారి నుంచి లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారి మోసాలకు లొంగిపోవొద్దని ఎంతగా చెబుతున్నా కొంత మంది మాత్రం మోసపోతూనే ఉన్నారు.
గత కొంత కాలంగా ఎంతో మంది అమ్మాయిలకు తన మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్ష చెరుకూరి అలియాస్ వంశీకృష్ణ ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆడవాళ్లతో గొంతు మారుస్తూ వంశీకృష్ణ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఈ మాయగాడి చేతిలో పడి దాదాపు రెండు వందలకు పైగా ఆడవాళ్లు మోసపోయినట్టు పోలీసులు తెలిపారు. దాదాపు ఇతడి మోసాల విలు ఎనిమిది కోట్లు అంచనా. ఇతగాడి మోసానికి గురైన ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రాజమండ్రికి చెందిన హర్ష చెరుకూరి అలియాస్ వంశీకృష్ణ, బీటెక్ మద్యలోనే ఆపివేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. తన జల్సాల కోసం అడ్డదారులు పట్టాడు. ఇంకేముంది మోసాలు చేస్తూ ఈజీగా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేయడం మొదలు పెట్టాడు. ఆన్ లైన్ లో సెర్చ్ చేసి వారి వివరాలు సేకరిస్తాడు. అమ్మాయి డీపీ పెట్టుకొని గొంతుమార్చి బాధితులకు ఫోన్ చేసి వారి వివరాలు సేకరిస్తాడు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని అందుకోసం కొంత డబ్బు చెల్లించాలని చెబుతుంటాడు. మరికొంత మందికి తానే డబ్బు వేసి చారిటీకి ఉపయోగించాలని చెప్పి తర్వాత వారికి మాయమాటలు చెప్పి డబ్బు లాగడం ప్రారంభిస్తాడు. ఇలా ఓ యువతి వంశీకృష్ణ చేతిలో మోసపోయి చివరికి చేసేదిలేక సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మోసగాడి గుట్టు బయట పడింది. యువతులతో పాటు పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు కూడా టోకరా వేశాడని తెలిసింది. వారి నుంచి కాజేసిన సొమ్ము హార్స్ బెట్టింగ్‌లతో పాటు విలాసాలకు ఖర్చు చేస్తాడని వెలుగులోకి వచ్చింది.
వంశీకృష్ణపై 14 నాన్ బెయిలబుల్ వారెంట్స్, అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో 50 వరకు ఎఫ్ ఐఆర్ లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వంశీకృష్ణను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ తరహా ఫిర్యాదులు అనేకం ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Karate Kalyani: నేను మోసపోయా.. శ్రీకాంత్‌రెడ్డి 420 : కరాటే కళ్యాణి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.