ప్రస్తుత సమాజం తీరు మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి అతిగా ఫీలవ్వడం.. మన గురించి మనం ఆలోచించుకోవడం వదిలేసి.. పక్కవారు మన గురించి ఏమనుకుంటున్నారో అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తున్నాం. ఈ క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయినా తట్టుకోలేకపోతున్నాం. జీవితం అంటేనే ఎన్నో సవాళ్ల పర్వం. అలాంటిది చిన్న చిన్న సమస్యలకే బెంబెలెత్తిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్నాం. ప్రస్తుతం సమాజంలో ఈ ఆత్మహత్యల పరంపర పెరిగిపోతుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే ఇంట విషాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: కలెక్టర్ టెన్నిస్ అటకు బంతులు అందించాలంటూ వీఆర్ఓలకు ఆదేశాలు!
అశ్వరావు పేట మాజీ ఎమ్మల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె.. తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం బూర్గంపాడు మండలం, సారపాకలో.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు మహాలక్ష్మి ఇటీవలే MBBS పూర్తి చేసి.. పీజీకి ప్రిపేర్ అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. చక్కగా చదువుకుంటుంది అని మురిసిపోయేలోపే ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దాడి!
కాగా మహాలక్ష్మి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకుని.. ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. డాక్టర్ చదవిన మహాలక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విషాదకరం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.