అమరావతి- కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ ఆర్ధిక సంవత్సరానికి జగన్ ప్రభుత్వం 2,29,779 కోట్లు మేర బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఐతే కేవలం ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నందుకు నిరసనగా టీడీపీ అసెంబ్లీ సమావేశాలను భహిష్కరించింది.ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు..: 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు
వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32శాతం అధిక కేటాయింపులు
బీసీ సబ్ ప్లాన్‌కు రూ.28,237 కోట్లు,
కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు,
ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ కింద రూ.3,840 కోట్లు,
మైనార్టీ సబ్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
పిల్లల కోసం రూ.16,748 కోట్లు,
మహిళాభివృద్ధికి రూ.47,283 కోట్లువైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 కోట్లు, లా నేస్తం కోసం రూ.16.64 కోట్ల, వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు
వైఎస్సార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు. వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు,
విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు,
వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్– పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.1,802 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ.500 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.1,112 కోట్లు
కాపు నేస్తం కోసం రూ. 500 కోట్లు,
ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం కోసం రూ.300 కోట్లు. ఈ సారి సంక్షేమ రంగానికి జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అధిక మొత్తంలో నిధులను కెటాయించింది.