స్పెషల్ డెస్క్- ఈ మధ్య వ్యాపార ప్రకటనల్లో సృజనాత్మకత బాగా పెరిగిపోతోంది. అందులోను మద్యపాన కంపెనీలు సెలబ్రెటీలచేత బాగా బాగా ప్రమోట్ చేయిస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ చేత విస్కీ కంపెనీలు యాడ్స్ చేయించి మందుబాబులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పటికే పలు మద్యం కంపెనీలు రెజీనా, పూజా హెగ్డే, రాయ్ లక్ష్మీ వంటివారి చేత రకరకాల విస్కీ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్ కూడా ఈ వరుసలో చేరిపోయింది. రష్మీ ఒక్కతే కాకుండా ఆమెకు చలాకీ చంటి, అవినాష్ కూడా జతకలిశారు. ఈ ముగ్గురూ కలిసి ఓ విస్కీ బ్రాండ్ ను బాగా ప్రమోట్ చేశారు.
ఈ విస్కీ యాండ్ లో రష్మి, చంటి, అవినాష్ సంబాషన ఎలా ఉందంటే.. హాయ్ నంబర్ వన్ చోట ఉన్నావ్ కదా.. ఏముంది నీ చేతిలో.. అని రష్మీ అడగడం, తరుణ్ అన్న చెప్పిండు కదా.. అని చంటి అనడం.. సమ్మటి విస్కీ, కమ్మటి వాసన అందుకే ఎంసీ నంబర్ వన్ అంటూ ఇద్దరూ కలిసి ఒకే సారి మందు బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. ఇంతలో ఈ గ్రూపులోకి అవినాష్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు.
ఏం రా అవినాష్ ఫుల్ ఫేమస్ అయినవ్.. దావత్ ఎప్పుడు ఇస్తున్నావ్.. దావత్ అంటే తెలుసు కదా.. జబర్దస్త్‌గా ఉండాలి.. అంటే నంబర్ వన్ ఉండాలి.. అని రష్మీ తన స్టైల్లో వయ్యారాలు ఒలకబోస్తూ అవినాష్ ను అడిగేసింది. సరే సరే నాకు పని ఉంది వెళ్తున్నా.. మన ఫ్రెండ్స్ అందరినీ పిలవండి.. దావత్ చేసుకుందాం అని అవినాష్ వెళ్లిపోతాడు.
ఇంతలో, ఎవరిని పిలుస్తావ్.. అని చంటిని రష్మీ అడుగుతుంది. ఫ్రెండ్స్ ను పిలవమని చెప్పాడు కదా.. అని చంటి సందేహంగా చూస్తాడు. ఫ్రెండ్స్ అందరినీ పిలవమని అన్నాడు కదా.. అందరినీ అంటే.. అందరినీ మన నెంబర్ వన్ ఫ్రెండ్స్ అందరినీ అని రష్మీ అంటుంది. అదన్న మాట సంగతి. ఓ విస్కీ బ్రాండ్ ప్రమోషన్ కోసం రష్మి ఈ యాడ్ లో నటించింది. మరి ఏ మేరకు మందు బాబులు రష్మీ యాడ్ కు అట్రాక్ట్ అవుతారో చూడాలి.