ఫిల్మ్ డెస్క్- తమిళ సినీ సూపర్ స్టార్ కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతీ హాసన్ తెలుసు కదా. కేవలం కమల్ కూతురుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను శృతి హాసన్ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తండ్రి కమల్ హాసన్ లాగే ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది ఈ అమ్మడు.
ఇక శృతి హాసన్ ప్రేమాయనాల విషానికి వస్తే గతంలో మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ అయ్యాక డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య శ్రుతీ హాసన్ తన ప్రియుడు శాంతనుతో ఎక్కువ సమయం గడుపుతోంది. తామిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను శృతి హాసన్ సోషల్ మీడియాతో షేర్ చేస్తుంటుంది. తరుచూ వీళ్లిద్దరు డిన్నర్లు, డేట్లు అంటూ అన్నోన్యంగా తిరుగుతూ ఏదో ఒక కెమెరాకు చిక్కుతున్నారు.
ఇటువంటి సమయంలో శ్రుతీ హాసన్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఎట్టకేలకు ఆమె స్పందించింది. శాంతను నా బెస్ట్ ఫ్రెండ్.. తనంటే నాకెంతో గౌరవం.. సంగీతం, ఆర్ట్ పట్ల తనకు మంచి అవగాహన ఉంది.. దాంతో మా అభిరుచులు కలిశాయి.. అందుకే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాను.. ఈ మధ్యన నా పెళ్లే పెద్ద టాపిక్‌గా చాలామంది మాట్లాడుకుంటున్నారు.. అని అంది.
అంతే కాదు పెళ్లికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ లేవు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడూ నేనే ఆ విషయాన్ని తెలియజేస్తా.. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు.. అని శ్రుతీహాసన్ చెప్పుకొచ్చింది. అన్నట్లు శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాలో నటిస్తోంది. మరో రెండు మూడు తమిళ్ ప్రాజెక్టులు కూడా సెట్స్ పై ఉన్నట్లు తెలుస్తోంది.