మహేంద్ర సింగ్ ధోని, హీరో విజయ్. వీరిద్దరూ తమ తమ ఫీల్డ్స్ లో సూపర్ స్టార్స్. సినిమాల విషయంలోకి వస్తే విజయ్ సౌత్ ఇండియా మెచ్చిన స్టార్. ఇక క్రికెట్ లో ధోని రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.., తాజాగా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో మెరిశారు.
ఈ ఏడాది మాస్టర్ తో దుమ్ములేపిన విజయ్.. ప్రస్తుతం బీస్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ధోని కూడా రాబోయే ఐపీఎల్ ప్రాక్టీస్ లో బిజీ. అయితే.., తలైవా ధోని అనుకోకుండా ఇళయదళపతి విజయ్ సెట్ కి విచ్చేశాడు. ధోని వస్తున్న విషయం తెలుసుకుని నేరుగా విజయ్ ఎదురెళ్లి మరీ మహేంద్రుడికి ఆహ్వానం పలకడం విశేషం.
తరువాత వీరిద్దరూ సెట్ లోనే కాస్త ఏకాంతంగా ముచ్చటించుకున్నారు. అయితే.., ఈ ఇద్దరూ కలవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అన్న విషయం తెలియరాలేదు. ఇక విజయ్ ని కలసిన సందర్భంలో ధోని లుక్ మాత్రం అదిరిపోయింది. మరి.., ఈ అరుదైన కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.