ఫిల్మ్ డెస్క్- 7 డేస్.. 6 నైట్స్.. ఏంటీ ఇదేదో వేకేషన్ టూర్ ప్లాన్ అనుకుంటున్నారా.. కాదండి బాబు.. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా పేరు. అవును 7డేస్ 6నైట్స్ పేరుతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ ఎం. అశ్విన్, ఎస్. రజనీకాంత్ సినిమాను నిర్మిస్తున్నారు.
మొన్నా మధ్య డర్టీ హరి సినిమాకు దర్శకత్వం వహించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, 7డేస్ 6నైట్స్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా 7డేస్ 6నైట్స్ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలోను రికార్డ్ టైమ్‌లో ఈ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడిపిలో చివరి షెడ్యూల్ పూర్తి చేశారు.
ఇక మిగతా డబ్బింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినమాను విడుదల చేస్తామని ఎంఎస్ రాజు తెలిపారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సినిమా చిత్రీకరణ పూర్తిచేశామని ఎంఎస్ రాజు చెప్పారు. కరోనా సమయంలోను పట్టుదల, క్రమశిక్షణతో పని చేసిన యూటిట్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కి 7డేస్ 6నైట్స్ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఎంఎస్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ తో 7 డేస్ 6 నైట్స్ కథ అందరిని ఆకట్టుకుంటుందని రాజు అన్నారు. అక్టోబర్ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.