సాధారణంగా చిన్నపిల్లలు పెద్దల కళ్లు గప్పి బలపాలు, మట్టి వంటివి తింటుంటారు. మరి చిన్న పిల్లలు అయితే దొరికిందల్లా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. అప్పుడు ముద్దుగా అనిపించవచ్చు కానీ.. ఆ తర్వాత అలవాటుగా మారిపోతూ ఉంటుంది.
సాధారణంగా చిన్నపిల్లలు పెద్దల కళ్లు గప్పి బలపాలు, మట్టి వంటివి తింటుంటారు. మరి చిన్న పిల్లలు అయితే దొరికిందల్లా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. అప్పుడు ముద్దుగా అనిపించవచ్చు కానీ.. ఆ తర్వాత అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అంతేనా ఒక్కోసారి రూపాయి బిల్లలు, చిన్న చిన్న వస్తువులు నోట్లో పెట్టుకుని గబుక్కున మింగేస్తారు. దీంతో వారిని హడావుడిగా ఆసుపత్రికి తీసుకెళుతుంటారు. ఇవి ఒక్కోసారి ప్రాణం మీదకు కూడా తెస్తుంటాయి. కొన్ని సార్లు ఆపరేషన్ చేసి తీయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. కానీ చిన్న పిల్లలు చేసే పని పెద్ద వాళ్లు చేస్తే ఏమంటారు. పై నుండి కిందకు ఎగా, దిగా చూస్తారు. ఈ వయస్సులో ఇదేం పనులంటూ ఎగతాళి చేస్తారు.
రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఓ పెద్దాయన అలాంటి ఓ పని చేసి వార్తల్లో నిలిచారు. ఇంతకు ఏం చేశాడనుకుంటున్నారు. పళ్లు తోముకునే బ్రష్ మింగేశాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉదయ్‌పూర్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన గోపాల్ సింగ్‌రావు (53) పళ్లు తోముకుంటుండగా టూత్ బ్రష్ గొంతులోకి వెళ్లింది. వెంటనే నోటిలో చెయ్యి పెట్టి బయటకు తీయాలని ప్రయత్నించే సరికి బ్రష్ పొట్టలోకి జారిపోయింది. ఊపిరాడక పోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే 12 సెంటీమీటర్ల బ్రష్‌ను బయటకు తీశారు. సీటీ స్కాన్‌లో పొట్ట పై భాగంలో ఇరుకున్నట్లు కనిపించిన టూల్ బ్రష్ ను ఎండోస్కోపిక్ విధానంలో సర్జన్ డా. శశాంక్ జె త్రివేది వైద్య బృందం సదరు వ్యక్తి నోటి నుండి బయటకు తీసింది.