బిజినెస్ డెస్క్- ఈ ప్రపంచంలో డబ్బులు చాలా మంది సంపాదిస్తారు. ఐతే సంపాదించిన సంపదను కాపాడుకోవడం, అవసరానికి మాత్రమే సరైన పద్దతిలో ఖర్చు చేయడం, సంపాదించిన డబ్బులను అనువైన రంగాల్లో పెట్టుబడిగా పెట్టడం ఇవన్నీ అనుభవంతో అలవాటువుతాయి. లేదా అర్ధిక రంగానికి చెందిన నిపుణుల సలహాల ద్వార తెలుసుకోవాలి. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించకపోతే సమయం, డబ్బు వృధా అయిపోతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా జాగ్రత్త చేసుకోవాలో అవగాహన తెచ్చుకోవాలి. ఇక మనం పెట్టుబడి పెట్టడంతో పాటు మన జీవితానికి భరోసా కల్పించేంది భారతీయ జీవిత భీమా సంస్థ ఎల్ ఐసీ.
అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ ఐసీ అనేక కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. జీవన్ ఆనంద్ పేరుతో ఒక పాలసీని అందిస్తోంది ఎల్ ఐసీ. ఈ పాలసీ తీసుకుంటే రోజుకు 74 రూపాయలు ఆదా చేస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు పొందొచ్చు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు టర్మ్‌తో పాలసీ పొందొచ్చు. 18 ఏళ్ల వయసు కలిగిన వారు 5 లక్షల రూపాయల బీమా మొత్తానికి 20 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే నెలకు 2265 రూపాయల ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు కేవలం75 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది.
పాలసీ గడువు ముగిసాక మెచ్యూరిటీ సమయంలో ఒకేసారు 10 లక్షల రూపాయలను అందిస్తుంది ఎల్ ఐసీ. ఇందులో పాలసీ డబ్బులు 5 లక్షల రూపాయలు కాకుండా బోనస్ కూడా లభిస్తుంది. బోనస్ మరో 4 లక్షల 50 వేల రూపాయల వరకు వస్తుంది. ఇంకా ఎఫ్ఏబీ కింద సుమారు 35 వేలు లభిస్తాయి. అంటే మొత్తంగా పాలసీ దారుడికి 10 లక్షల రూపాయల వరకు వస్తాయి. పాలసీ టర్మ్ కాలంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులు మొత్తం 10 లక్షల రూపాయలు చెల్లిస్తుంది ఎల్ ఐసీ. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఎల్ ఐసీ పాలసీ చేసేయండి మరి.