ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి సంబంధించి ఎంతోమంది సెలబ్రిటీలను కోల్పోయారు ప్రేక్షకులు. వారంతా వివిధ కారణాలతో మరణించినప్పటికీ.. అభిమానులను మాత్రం ఫేవరేట్ సెలబ్రిటీ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్ కన్నుమూశారు. 56 ఏళ్ళ వయసులో ఈ పాపులర్ యాక్టర్ నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘యంగ్ టాలెంట్ టైమ్’ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ.. ఇలా ఆకస్మికంగా చనిపోయాడని తెలిసి ఫ్యాన్స్ అంతా విషాదంలో మునిగిపోయారు.
ఇక 1979 నుండి 1983 వరకు యంగ్ టాలెంట్ టైమ్ ప్రోగ్రాంలో రెగ్యులర్ పెర్ఫార్మర్ గా వర్క్ చేశారు. ఆ షోలో వర్క్ చేసిన టీమ్ అంతా ఇప్పుడు బాబీకి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ‘యంగ్ టాలెంట్ టైమ్ లో మేమంతా కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మా టీమ్ లో ఒకరైన బాబీ మరణించారనే వార్త వినడం బాధాకరంగా ఉంది’ గురువారం రాత్రి ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. అయితే.. నిద్రలోనే చనిపోయాడు అనే విషయంపై బాబీ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాబీ 1966లో ఏప్రిల్ 26న జన్మించారు. నటుడిగా కెరీర్ పరంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.
బాబీ కెరీర్ లో యంగ్ టాలెంట్ టైమ్(1979), నెయిబర్(1985) టీవీ సిరీస్, యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. లైఫ్ లో గుర్తింపు కోసం, వృత్తిలో పాపులారిటీ కోసం ఎంతో కష్టపడతారు. బాబీ అంతకుమించిన కష్టాన్ని చూసి.. పైకి వచ్చారని ఆయన స్నేహితులు చెప్పుకొచ్చారు. కాగా.. మరణం తర్వాత కూడా గుర్తుంచుకునే వ్యక్తులలో బాబీ ఒకరని తెలిపారు. ఇక బాబీ ఫ్యామిలీకి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు సైతం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరి ఇండస్ట్రీలో వరుస సెలబ్రిటీల మరణాల గురించి, బాబీ డ్రైసెన్ మృతి పట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.