సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించే హీరోయిన్లపై ఎప్పుడూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ.. బయట ప్రపంచంలో వారిపై ఎలాంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయనే విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో.. సరైన సమయం చూసి తప్పకుండా స్పందిస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ అక్కడితో స్టాప్ అవుతుందని.. అవకాశాల పరంగా ఇబ్బందులు పడతారని అభిప్రాయాలు వెలువడుతుంటాయి. కానీ, పెళ్ళైనా కూడా కెరీర్ ని విజయవంతంగా సాగిస్తున్న హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు.
ఇటీవల దాదాపు అన్ని రంగాలలో రాణిస్తున్న బ్యాచిలర్స్ అంతా పెళ్లికి ముందే సెటిల్ అవ్వాలని, పెళ్లి కెరీర్ కి అడ్డుకట్ట అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడీ ఆలోచన ధోరణి సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే.. పెళ్ళైనా సరే అర్థం చేసుకునే భర్త దొరికితే అంతా సవ్యంగానే ఉంటుందని అంటోంది ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్. ఈ బ్యూటీ గురించి చెప్పాలంటే ఎక్కువగా బ్యూటీ యాడ్స్ ద్వారానే పరిచయం. అంతేగాక తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాలు చేసింది. కానీ, పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో కెరీర్ పరంగా బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత సెటిల్ అయిన యామీ.. తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కెరీర్ ముగిసినట్టే అని ఎప్పుడూ అనుకోవద్దు. కెరీర్ కి పెళ్లి అనేది అడ్డు కాదని గ్రహించాలి. ఈ విషయాన్నీ చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు. ప్రతి మహిళ తన లైఫ్ లో ఎన్నో చేయాలని అనుకుంటుంది. వారికి తగినవాడు, వారి ఆలోచనలకు గౌరవమిచ్చే భర్త దొరికితే రెండింతల ఉత్సాహంతో ముందుకు సాగవచ్చు” అని చెప్పుకొచ్చింది. యామీ రీసెంట్ గా దర్శకుడు ఆదిత్య ధర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరం సినిమాల్లో ఉండేసరికి కలిసి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం యామీ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.