ఈ మధ్యకాలంలో ఎలాంటి స్పెషల్ డే వచ్చినా.. బుల్లితెర టీవీ ఛానల్స్ అన్నీ కొత్త కొత్త కార్యక్రమాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఆ స్పెషల్ డే లేదా మూమెంట్ ని బట్టి.. ప్రేక్షకులను అలరించేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి.. ఇలా పెద్ద పండుగలకు ప్లాన్ చేసినట్లుగానే ‘ఫిబ్రవరి 14న రాబోయే వాలెంటైన్స్ డే’కి కూడా స్పెషల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జీ ఛానల్ వారు వాలెంటైన్స్ డే కోసం ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ అంటూ కొత్త ప్రోగ్రాం ప్రసారం చేయనుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఇక తక్కువ నిడివితో వచ్చిన ప్రోమో.. సరదాగా బుల్లితెర ప్రేమ జంటలతో సాగింది. సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవారు సైతం వారి వారి జంటలతో పాల్గొన్నారు. అలా పాల్గొన్న వారిలో నూకరాజు – ఆసియా ఉన్నారు. వారు స్టేజ్ పై ప్రపోజ్ చేసుకున్న తర్వాత.. యాదమ్మ రాజు యూఎస్ లో ఉన్న తన భార్య స్టెల్లాతో వీడియో కాల్ లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో లైవ్ లోనే యాదమ్మ రాజు స్టెల్లాకి లవ్ యూ చెప్పాడు. దీంతో వెంటనే దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంది స్టెల్లా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ యాదమ్మ రాజు – స్టెల్లా జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.