భారత ఫిల్మ్ ఫెడరేషన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఆస్కార్ కు పంపకపోయినప్పటికీ.. అవార్డు గెలుచుకుని వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఆస్కార్… ప్రపంచంలోని ప్రతి డైరెక్టర్ లేదా యాక్టర్ ఒక్కసారైనా అందుకోవాలని అనుకునే అవార్డు. మిగతా భాషల వాళ్లకేమోగానీ తెలుగు మూవీకి అది ఇన్నేళ్లపాటు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని బ్రేక్ చేసిన స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రికార్డు సృష్టించాడు. ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమే ఊగిపోయేలా చేసి ఆస్కార్ వచ్చి మన ఒడిలో పడిందుకు కారణమయ్యాడు. ఇలా అంతా హ్యాపీగా ఉన్న టైంలో రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్.. ఆస్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ రెహమాన్ ఎందుకు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి కారణమేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది కాదు విషయం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్ కు పంపలేదు. అయినా సరే తమ వంతు ప్రయత్నం చేసి నామినేషన్స్ లో నిలిచింది. ఏకంగా ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ విషయాన్నే ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అర్హత లేని చాలా సినిమాలని ఆస్కార్ కు పంపిస్తున్నారని, దీని వల్ల అర్హత ఉన్న సినిమాలకు అన్యాయం జరిగిపోతుందని వాపోయారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్కార్ లో మన చిత్రాలు అవార్డు గెలుచుకోవడం అనే టాపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్తాయని నేను అనుకుంటాను. కానీ అవి అంతవరకు వెళ్లవు. అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు. దీంతో నేను ఏం చేయలని స్థితిలో ఉంటున్నాను.’ అని రెహమాన్ తన బాధని బయటపెట్టారు. అయితే భారత్ నుంచి ఈసారి అధికారిక ఎంట్రీగా ‘ఆర్ఆర్ఆర్’ని కాదని గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ని పంపించారు. అది కనీసం నామినేషన్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు రెహమాన్ కామెంట్స్.. ఈ సినిమాతో పాటు ఇంతకుముందు పంపిన పలు చిత్రాల గురించేనా అనిపించేలా ఉన్నాయి. ఏదేమైనా సరే ఏఆర్ రెహమాన్ మాటలు.. ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ కు కారణమయ్యాయి. మరి ఇతడి వ్యాఖ్యలపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.